రథోత్సవంలో అపశ్రుతి

ABN , First Publish Date - 2020-12-30T06:17:34+05:30 IST

మండలంలోని వైద్యంగుండ్లపల్లిలో మంగళవారం ఉదయం ఆంజనేయస్వామి కార్తీక రథోత్సవం సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది.

రథోత్సవంలో అపశ్రుతి
మృతిచెందిన లోకేష్‌

రథానికి  విద్యుత్‌ తీగలు తగిలి ఒకరి మృతి

ఐదుగురికి తీవ్ర గాయాలు

గుమ్మఘట్ట, డిసెంబరు 29: మండలంలోని వైద్యంగుండ్లపల్లిలో మంగళవారం ఉదయం ఆంజనేయస్వామి కార్తీక రథోత్సవం సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. ఏటా నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా రథం లాగుతుండగా పైన వి ద్యుత్‌ తీగలు తగిలాయి. దీంతో ఇనుప రథానికి వి ద్యుత్‌ ప్రసరించి, దాని చక్రాలను తోస్తున్న లోకేష్‌ (28) మృతి చెందగా.. గంగన్న (42), మారెన్న (38), సంతోష్‌ (8)లతోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంతోష్‌, మారెన్న పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం అ క్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి సిఫారసు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గంగన్న, నరేష్‌ రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొం దుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు గుమ్మఘట్ట పోలీసులు తెలిపారు. మృతిచెందిన లోకే్‌షకు ఏడాది క్రితం చిత్ర అనే అమ్మాయితో వివాహమవగా.. సంతానం కలగలేదు. అతడి భార్య, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. విషయం తెలియగానే మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి కాలవ సన్నణ్ణ, మాజీ ఎంపీపీలు రాఘవరెడ్డి, గిరిమల్లప్ప, మాజీ సర్పంచ్‌ హనుమంతప్పతోపాటు పలువురు టీడీపీ నాయకులు దానవేంద్ర, మురళి, సంజీవ ఆస్పత్రికి చేరుకుని, బాధితులను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుతోపాటు టీడీపీ నాయకులు ప్రమాద స్థలానికి చేరుకుని, లోకేష్‌ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Updated Date - 2020-12-30T06:17:34+05:30 IST