పొంగిన వాగులు, వంకలు

ABN , First Publish Date - 2020-11-27T06:14:03+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి వరకు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

పొంగిన వాగులు, వంకలు

కదిరి ప్రాంతంలో భారీ వర్షం

కదిరి - రాయచోటి 

రహదారిపై స్తంభించిన రాకపోకలు.. 

జిల్లాలో పలు చోట్ల 

ఓ మోస్తరు వర్షం

దెబ్బతిన్న వరి, పత్తి, మొక్కజొన్న, 

కంది పంటలు

అప్రమత్తంగా అధికార యంత్రాంగం

క్షేత్రస్థాయిలో పర్యటించిన 

ఎస్పీ, జేసీ, ఇతర ఉన్నతాధికారులు

అనంతపురం వ్యవసాయం, నవంబరు 26 : నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి వరకు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ముఖ్యంగా కదిరి డివిజన్‌లోని పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. గాండ్లపెంట మండల పరిధిలోని కదిరి-  రాయచోటి ప్రధాన రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. మిగిలిన నియోజకవర్గాల్లోని మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది.  తనకల్లు మండలం ఈతోడు గ్రామంలో వర్షానికి వరి పంట నేలకొరిగింది. అలాగే పలు ప్రాంతాల్లో పత్తి, మొక్కజొన్న, వరి, కంది పంటకు నష్టం వాటిల్లింది.  ఏఏ ప్రాంతాల్లో ఎంత మోతాదులో పంటనష్టం జరిగిందన్న సమాచారం సేకరించడంలో వ్యవసాయ అధికారులు నిమగ్నమయ్యారు. 


ఓ మోస్తరు నుంచి భారీ వర్షం 

కదిరి, తనకల్లు, తలుపుల, గాండ్లపెంట,  నల్లచెరువు, ఎన్‌పీకుంట,  నల్లమాడ, ఓడీచెరువు, అమడగూరు తదితర ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం పడింది. ఆ యా ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి వరకు వర్షం పడుతూనే ఉంది. అలాగే గోరంట్ల, ధర్మవరం, చిలమత్తూరు, యల్లనూరు తదితర మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల్లోని మండలాలు, తాడిమర్రి, అనంతపురం, యాడికి, పుట్టపర్తి, కూడేరు, మడకశిర, గార్లదిన్నె, రాప్తాడు, పామిడి, కొత్తచెరువు, బత్తలపల్లి తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. బుధవారం రాత్రి 33 మండలాల్లో వర్షం పడింది. ఎన్‌పీకుంటలో  26.6 మి.మీ, గాండ్లపెంట 22, కదిరి 17.4, తనకల్లు 17.2, నల్లచెరువు 15.2, అమడగూరు 12.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన మం డలాల్లో చిరుజల్లులు పడ్డాయి. మరోవైపు తుఫాన్‌ నేపథ్యంలో పంట ఉత్పత్తుల కొనుగోలును తాత్కాలికంగా నిలిపేశారు. ఈనెల 28వ తేదీ వరకు  వేరుశనగ, మొక్క జొ న్న, సజ్జ, కొర్ర, రాగి కొనుగోలును నిలుపుదల చేసినట్లు యంత్రా ంగం స్పష్టం చేసింది. 


నంబులపూలకుంటలో...

నంబులపూలకుంట : మండలంలో నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో బుధవారం రాత్రి 10 గంటల నుంచి కు రుస్తున్న వర్షానికి చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి.  ఎడతెరపి లేకుండా వాన కురవడంతో మండల వ్యాప్తం గా రైతులు సాగుచేసిన వరి పంట పూర్తిగా దెబ్బతింది. ఈ ఏడా ది ఆశాజనకంగా వర్షాలు కురవడంతో రైతులు ముందస్తు గా వరినాట్లు వేశారు. అయితే రేపో, మాపో కోత కోయా ల్సిన వరిపంటను నివర్‌ తుఫాన్‌ నేలమట్టం చేసిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఇలాగే మరో రెండు రోజులు వర్షం కురిస్తే పొలాల్లోనే ధాన్యం మోసులు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దెబ్బతిన్న వరిపంటలను  తహసీల్దార్‌ పీవీ రమణ, ఎంపీడీఓ ఆదినారాయణ, ఎస్‌ఐ నరసింహు డు పరిశీలించారు. మండలంలోని చెరువులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. మండల అధికారులు గురువారం ఉదయం నుంచి కార్యాలయంలో ఉంటూ సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు. రోడ్డుకు అడ్డుగా చెట్లు విరిగినా త్వరితగతిన సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎగువతూపల్లి గ్రామంలో పురాతన మిద్దెలు ఉండటంతో ఆగ్రామానికి తహసీల్దార్‌, ఎంపీడీఓ , ఎస్‌ఐ  వెళ్లి  సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని వారికి సూచించారు. కదిరి డీఎస్పీ భవ్యకిశోర్‌, సీఐ మధు పెద్దచెరువును పరిశీలించారు. వరదనీరు ఉధృతంగా ఉండటంతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్ర మాదకర పరిస్థితి రాకుండా సహాయక చర్యలు చేప ట్టాలని ఎస్‌ఐ నరసింహుడుకు సూచించారు.  


గాండ్లపెంటలో...

గాండ్లపెంట : తుఫాన్‌ ప్రభావంతో గురువారం  మండలంలో కుండపోత వర్షం కురిసింది. కొద్ది గంటలలోనే మడుగువారిగొంది, జమాల్‌ఖాన్‌ చెరువు, చామాల గొంది చెరువు, కోటపల్లి చెరువులు నిండిపోయాయి. ఎగువప్రాంతం చెరువులు నిండి వరదప్రవాహం తీవ్రం కావటంతో కదిరి - రాయచోటి ప్రధాన రహదారిపై చా మాలగొంది క్రాస్‌ వద్ద  రాకపోకలు పూర్తిగా స్తంభించి పోయాయి. దీంతో తహసీల్దార్‌ వెంకటరమణ, ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి సిబ్బంది, గ్రామస్థుల సహకారంతో తాళ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులను సురక్షితంగా రోడ్డు దాటించారు. కదిరి డీఎస్పీ భవ్యకిశోర్‌, రూరల్‌ సీఐ , రెవెన్యూ అధికారులు ముందు జాగ్రత్తగా చామాలగొంది వద్ద నిండిన రెండు చెరువులను పరిశీలించి ముంపునకు గురయ్యే పరిస్థితిని అధ్యయనం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రెక్కమాను, వెలిచెలమల, గౌకనపేట, ఎన్పీకుంట మీదుగా రాయచోటికి వాహనాలు వెళ్లేలా దారి మళ్లించారు. 


చెరువులను పరిశీలించిన డీఎస్పీ 

నల్లచెరువు :  మండలంలోని కే పూలకుంట పరిసర ప్రాంతాల చెరువులను డీఎస్పీ భవ్యకిశోర్‌ గురువారం పరిశీలించారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి మండలంలోని ఓరువాయి, ఉబిచెర్ల, కే పూలకుంట, పోలేవాండ్లపల్లి గ్రామాలలో రైతులు సాగుచేసిన వరి పంట నేల కొరిగి నీట మునిగింది. ఆయా ప్రాంతాల్లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులు, పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ ఆయా గ్రామాల ప్రజలకు సూచించారు. డీఎస్పీ వెంట ఎస్‌ఐ మునీర్‌అహమ్మద్‌, పోలీసులు, అధికారులు, గ్రామస్థులు ఉన్నారు. 


పంతులచెరువును పరిశీలించిన జేసీ 

నల్లచెరువు :  మండలంలోని పంతులచెరువు గ్రామం చెరువుకట్టను జేసీ నిశాంత్‌కుమార్‌ గురువారం పరిశీలించారు. జేసీ వెంట ఆర్డీఓ వెంకటరెడ్డి, డీఎస్పీ భవ్య కిశోర్‌, మండల అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ పరిస్థితులపై జేసీ అధికారులను అడిగి తెలుసుకు న్నారు.  


రోడ్డుపై పడిన చెట్టు ... రాకపోకలకు అంతరాయం

నల్లమాడ : తుఫాన్‌ ప్రభావంతో మండలంలోని పులగంపల్లి గ్రామం వద్ద గురువారం కదిరి - హిందూపురం ప్రధాన రహదారి పక్కన ఉన్న పెద్దచెట్లు రోడ్డుపై అడ్డంగా పడింది. వాటి మీదుగా వెళ్లిన విద్యుత్‌ తీగలు కూడా  రోడ్డుపై ప డ్డాయి. దీంతో గంట పాటు రాకపోకలు నిలిచిపోయాయి. పంచాయతీ అధికారులు, విద్యుత్‌ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు పై అడ్డంగా ఉన్న చెట్టును తొలగించి, విద్యుత్‌ తీగలకు మరమ్మతులు చేశారు. రాకపోకలు స్తంభించడంతో గంట పాటు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మండలంలోని ఎద్దులవాండ్లపల్లి గ్రామ రైతు నంజిరెడ్డి సాగుచేసిన వరిపంట గురువారం తుఫాన్‌ దాటికి నేలమట్టమైంది.  

Read more