-
-
Home » Andhra Pradesh » Ananthapuram » ATP NEWS
-
రైతుల అరెస్ట్‌పై తమ్ముళ్ల ఆగ్రహం
ABN , First Publish Date - 2020-10-31T09:51:00+05:30 IST
రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులపై అక్రమ కేసులు పెట్టి, బేడీలు వేసి అరెస్ట్ చేయడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చేతులకు బేడీలు, నోటికి
నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన
అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన
అమరావతి ఉద్యమాన్ని
నీరు గార్చేందుకు కుట్ర
డీఎస్పీని సస్సెండ్ చేసి సీఎం క్షమాపణ చెప్పాలి
మాజీ మంత్రి కాలవ మండిపాటు
అనంతపురం వైద్యం, అక్టోబరు 30 : రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులపై అక్రమ కేసులు పెట్టి, బేడీలు వేసి అరెస్ట్ చేయడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లాలో టీడీపీ వివిధ రూపాలలో అమరావతి రైతులకు మద్దతుగా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద చేతులకు బేడీలు వేసుకొని నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని తమ్ముళ్లు వినూత్న నిరసన కొనసాగించారు. ఈ నిరసనలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. కాలవ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వమే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. మానవ హక్కులను వైసీపీ నేతలు కాలరాస్తున్నార న్నారు. దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి బేడీలు వేసి అరెస్ట్ చేయడం వైసీపీ దుర్మార్గ పాలనకు పరాకాష్ట అన్నారు. అమరావతిపై కక్షకట్టి జగన్ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
దళిత రైతులకు బేడీలు వేసి అరెస్ట్ చేసిన డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని, ముఖ్యమంత్రి జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు తలారి ఆదినారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు, నాయకులు సరిపూటి రమణ, మారుతీగౌడ్, దేవళ్ల మురళీ, నారాయణస్వామి యాదవ్, లింగారెడ్డి, కాకర్ల ఆదినారాయణ, బంగి నాగ, కూచే హరిప్రసాద్, టైలర్ శీనా, సుధాకర్‌యాదవ్, గంగవరం బుజ్జి, రజాక్, ఎన్‌బీకే నారాయణస్వామి, కుళ్లాయప్ప, బొమ్మినేని శివ, నరసింహులు, శ్రీనివాస చౌదరి, రాము, పవన్, రామకృష్ణ, శ్రీవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.