పరిహారంలో తేడాలపై పరిటాల సునీత ఫైర్‌

ABN , First Publish Date - 2020-10-31T09:47:57+05:30 IST

చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ముంపు బా ధితులకు పరిహారంలో తేడాలపై మాజీ మం త్రి పరిటాల సునీత ఆ గ్రహం వ్యక్తం చేశారు.

పరిహారంలో తేడాలపై పరిటాల సునీత ఫైర్‌

 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు పరామర్శ 


బత్తలపల్లి, అక్టోబరు 30 : చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ముంపు బా ధితులకు పరిహారంలో తేడాలపై మాజీ మం త్రి పరిటాల సునీత ఆ గ్రహం వ్యక్తం చేశారు. తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లిలో శుక్రవారం గ్రామస్థుల ను ఖాళీ చేయించడం లో అధికారులు అత్యుత్సాహం చూపడంతో ఓ చిన్నారి, ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. వారు ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న ఆమె నేరుగా ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం వారికి ఆర్థిక సాయం చేశారు. అక్కడే ఉన్న ఆర్డీఓ మధుసూదన్‌తో జరిగిన విషయంపై ఆరా తీశారు. మూడు గ్రామాల ప్రజలకు ఒక న్యాయం, ఒక్క మర్రిమాకులపల్లి గ్రామస్థులకు మాత్రం మరో న్యాయం ఏంటని ప్రశ్నించారు.


ముంపునకు గురైన వారిలో అన్నివర్గాలు ఉంటారని అందరూ నష్ట పోయింటారని అందరికీ సమన్యాయం చేయాల్సిన బాధ్యత అధికారుల పై ఉందన్నారు. పరిహారం పంపిణీలో అర్హులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, గ్రామంలోని బాధి తులకు న్యాయం జరిగేవరకు ఽధర్నా చేస్తామని తెలిపారు.  119 మంది అర్హుల జాబితా సిద్ధం చేశామని మిగిలిన వారు ఎవరైనా ఉన్నా వారిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని తెలిపారు. ఇదే విషయంపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని పేర్కొన్నారు. అవసరమైతే సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ ద్వారా విషయం తెలియ జేస్తామని తెలిపారు. 

Updated Date - 2020-10-31T09:47:57+05:30 IST