వాన నీటిలో కొట్టుకుపోయిన వేరుశనగ కాయలు

ABN , First Publish Date - 2020-10-13T10:41:10+05:30 IST

మండలంలోని చాలవేముల గ్రామం లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రామశివరెడ్డి, విశ్వనాథరెడ్డి పొలంలో వేరుశనగ కాయలు కొట్టుకుపోయాయి.

వాన నీటిలో కొట్టుకుపోయిన వేరుశనగ కాయలు

పుట్లూరు, అక్టోబరు 12: మండలంలోని చాలవేముల గ్రామం లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రామశివరెడ్డి, విశ్వనాథరెడ్డి పొలంలో వేరుశనగ కాయలు కొట్టుకుపోయాయి. సుమారు ఇద్దరు రైతులు 3 ఎకరాల్లో పంట సాగుచేయగా, 35 బస్తాల కా యలు నీళ్లలో కొట్టుకుపోయినట్లు బాధిత రైతులు వాపోయారు. ల క్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని, ఆశించిన దిగుబడి వచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఆదుకోవాలని రైతులు కోరారు. 


 కూలిన ఇళ్లకు పరిహారం ఇవ్వాలి

పుట్లూరు మండలంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు  మట్టిమిద్దెలు పెద్దఎత్తున కూలిపోయాయని, పరిహారం ఇవ్వాలని సోమవారం ఎమ్మెల్యే పద్మావతికి సీపీఎం నాయకులు విన్నవించారు. నా యకుడు రామాంజి మాట్లాడుతూ సుమారు 200 పైగా ఇళ్లు కూలి నా ఒక్క పైసా కూడా రాలేదన్నారు. బాధితులు అప్పులుచేసి ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి  బాధితులకు నూతన ఇళ్లు నిర్మించాలని డిమాండ్‌చేశారు.

 

పంట నష్టంపై వ్యవసాయాధికారుల నివేదిక

కూడేరు : మండలంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ పంటను సోమవారం వ్యవసాయాధికారి నవత, ఏఈఓ శైలజ పరిశీలించారు. పంట నష్టం వివరాలు సేకరించారు. గత నెలలో దాదాపు 183 హెక్టార్లలో వేరుశనగ పంట తొలగించిన తర్వాత వర్షానికి దెబ్బతిన్నట్లు ఉన్నతాధికారులకు నివేదించారు. నష్టపోయిన రైతులు ఆర్బీకే అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు.

Updated Date - 2020-10-13T10:41:10+05:30 IST