-
-
Home » Andhra Pradesh » Ananthapuram » atp news
-
కరోనా కేసులు 209
ABN , First Publish Date - 2020-10-07T08:48:46+05:30 IST
జిల్లాలో కరోనా మరింత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు పూర్తిగా తగ్గుతున్నాయి.

మరో ముగ్గురి మృతి
అనంతపురం వైద్యం, అక్టోబరు6: జిల్లాలో కరోనా మరింత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు పూర్తిగా తగ్గుతున్నాయి. మంగళవారానికి గడిచిన 24 గంటల్లో 209 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ముగ్గురు బాధితులు మరణించారు. జిల్లాలో అత్యధికంగా కోలుకుంటున్నా రు. ఇప్పటి వరకు 59,214 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 509 మంది మరణించారు. 57,491 మంది కోలుకున్నారు. 1214 మంది చికిత్స పొందుతున్నారు.
జిల్లాలో మూడు నెలలుగా కొవిడ్ ఆస్పత్రుల్లో కనీసం బెడ్ దొరక టం కష్టంగా ఉండేది. ప్రస్తుతం బాధితుల సంఖ్య పూర్తిగా తగ్గడంతో మంచాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జిల్లా సర్వజనాస్పత్రి, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రుల్లో సై తం ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వైద్యులు, సిబ్బంది ఊపిరి పీల్చుకుంటున్నారు.