-
-
Home » Andhra Pradesh » Ananthapuram » atp news
-
చెరువుల పునరుద్ధరణకు సర్వే
ABN , First Publish Date - 2020-10-07T08:45:54+05:30 IST
జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు సర్వే చేపట్టాలని కలెక్టర్ గంధం చంద్రుడు..

13లోగా బృందాల ఏర్పాటు: కలెక్టర్
అనంతపురం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు సర్వే చేపట్టాలని కలెక్టర్ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పలు శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమై, మాట్లాడారు. చెరువులపై సర్వే నిమిత్తం జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయిలో మల్టీ డిసిప్లినరీ బృందాలను ఈనెల 13వ తేదీలోగా ఏర్పాటు చేయాలన్నారు.
నవంబరు 14లోపు సర్వే ప్రక్రియ పూర్తి చేసి, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షపు చుక్కన పడినచోటే భూమిలోకి ఇంకిపోయేలా చేయటమే చెరువుల పునరుద్ధరణ లక్ష్యమన్నారు. డిసెంబరు మొదటి వారంలో ఈ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీటీ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి.. అధికారులకు పలు సలహాలిచ్చారు. కార్యక్రమంలో డ్వామా, ఏపీఎంఐపీ పీడీలు వేణుగోపాల్‌రెడ్డి, సుబ్బరాయుడు, గ్రౌండ్ వాటర్ డీడీ తిప్పేస్వామి, నీటిపారుదల, హంద్రీనీవా ఎస్‌ఈలు సుధాకర్, వెంకటరమణ, హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స, హెచ్చెల్సీ ఈఈలు రాజగోపాల్, మోహన్‌మూర్తి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బాషా పాల్గొన్నారు.