జేసీపై మరో కేసు..

ABN , First Publish Date - 2020-10-07T08:44:02+05:30 IST

పోలీసు యాక్ట్‌ 30ని అతిక్రమించారన్న దానిపై 188 ఐపీసీ కింద తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అశ్మిత్‌రెడ్డి, మరో 32 మందిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

జేసీపై మరో కేసు..

తాడిపత్రి, అక్టోబరు6: పోలీసు యాక్ట్‌ 30ని అతిక్రమించారన్న దానిపై 188 ఐపీసీ కింద తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అశ్మిత్‌రెడ్డి, మరో 32 మందిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కొవిడ్‌ను జయించిన తర్వాత మొట్ట మొదటిసారిగా తాడిపత్రికి వచ్చిన వారికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులతో ఊరేగింపు సాగింది.


పట్టణంలో అమలులో ఉన్న 30 పోలీసు యాక్ట్‌, కొవిడ్‌ నిబంధనలను అతిక్రమించారన్న దానిపై కేసు నమోదు చేశారు. కేసులో యాడికి మాజీ ఎంపీపీ రంగయ్య, సోమ శేఖర్‌ నాయుడు, రఘునాథరెడ్డి, లోకనాథరెడ్డి, సూర తిరుపాల్‌రెడ్డి, జేసీ శశిధర్‌రెడ్డి, జేసీ సుధీర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, యుగంధర్‌, కులశేఖర్‌రెడ్డి, రామచంద్రనాయుడు, చంద్రశేఖర్‌నాయుడు, పవన్‌కుమార్‌ రెడ్డి, సత్యనారాయణరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఉస్మాన్‌బాషా, రాబర్ట్‌, దినేష్‌, శంకరయ్య, రామనాథరెడ్డి, దాసరి హరినాథ్‌, నదీం, వడ్డే మధు ఉన్నారు.

Read more