భర్త నుంచి రక్షణ కల్పించండి

ABN , First Publish Date - 2020-10-04T09:04:51+05:30 IST

ప్రేమించి, పెళ్లి చేసుకున్న భర్త తనను నిత్యం చిత్రహింసలు పెడుతున్నాడనీ, రక్షణ కల్పించాలని నగరంలోని నీరుగంటివీధికి చెందిన స్వాతి శనివారం వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది.

భర్త నుంచి రక్షణ కల్పించండి

అనంతపురం కార్పొరేషన్‌, అక్టోబరు 3: ప్రేమించి, పెళ్లి చేసుకున్న భర్త తనను నిత్యం చిత్రహింసలు పెడుతున్నాడనీ, రక్షణ కల్పించాలని నగరంలోని నీరుగంటివీధికి చెందిన స్వాతి  శనివారం వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆరు నెలల క్రితం మంగళవారి కాలనీకి చెందిన మునిశేషారెడ్డి, తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నామని తెలిపింది. తమ వివాహాన్ని రిజిస్టర్‌ చేయించుకున్నామంది. మూడునెలల వరకూ కాపురం సజావుగా సాగిందనీ, ఆ తరువాత చిత్రహింసలు ప్రారంభమయ్యాయని కన్నీటి పర్యంతమైంది. తన భర్తకు గతంలోనే పెళ్లయిందనే విషయం తెలియక మోసపోయాననీ, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చే యగా.. అరెస్టు చేశారన్నారు.


బెయిల్‌పై రావటం, తనను ఇష్టానుసారంగా కొట్టి చిత్రహింసలు పెడుతున్నట్లు తెలిపింది. మునిశేషారెడ్డి మొదటి భార్య పవిత్ర తన అత్తతో కలిసి స్టేషన్‌కు అదే సమయంలో వచ్చింది. స్వాతి తన భర్తను మా యచేసి, పెళ్లి చేసుకుని, తనకు అన్యాయం చే స్తోందని వాపోయింది. తనకు నాలుగేళ్ల పాప ఉందనీ, ఆ విషయం తెలిసి తన భర్తను పెళ్లి చే సుకుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో న్యాయం చేయాలని పవిత్ర కూడా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇద్దరి ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేస్తున్నారు.

Updated Date - 2020-10-04T09:04:51+05:30 IST