యూపీఎస్సీ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2020-10-03T11:42:02+05:30 IST

యూపీఎస్సీ పరీక్షలు రాయడానికి వచ్చే కడప, కర్నూలు జిల్లాల అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

యూపీఎస్సీ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు

అనంతపురం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): యూపీఎస్సీ పరీక్షలు రాయడానికి వచ్చే కడప, కర్నూలు జిల్లాల  అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 4న అ నంతపురంలో యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో 3వ తేదీన 07245 నెంబర్‌ రైలు కడప రైల్వేస్టేషన్‌ నుంచి మ ధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరుతుందన్నారు. ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, కల్లూరు స్టేషన్ల మీదుగా రాత్రి 7.30 గంటలకు అనంతపురం రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందన్నారు.


కర్నూలు రైల్వేస్టేషన్‌ నుంచి 3వ తేదీన 07243 నెంబరు రైలు సాయంత్రం 6 గంటలకు బయల్దేరి డోన్‌, పెండేకల్లు, గుంతకల్లు, గుత్తి, కల్లూరు మీదుగా రాత్రి 8 గంటలకు అనంతపు రం చేరుకుంటుందన్నారు. ఈనెల 4న అనంతపురం రైల్వేస్టేషన్‌ నుంచి 07246 నెంబర్‌ రైలు సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరి కల్లూరు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల మీ దుగా రాత్రి 10.30 గంటలకు కడప రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందన్నారు.


4వ తేదీ రాత్రి 7.30 గంటలకు 07244 నెంబర్‌ రైలు అనంతపురం రైల్వేస్టేషన్‌ నుంచి బయల్దేరి కల్లూరు, గుత్తి, గుంతకల్లు, పెండేకల్లు, డోన్‌ మీదుగా కర్నూలు రైల్వేస్టేషన్‌కు రాత్రి 11.30 గంటలకు చేరుకుంటుందన్నారు. ఈ రైళ్లలో ప్రయాణానికి 4 గంటల ముందు వరకూ రిజర్వేషన్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించిన నేపథ్యంలో అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 4వ తేదీన అనంతపురం రీజియన్‌లో 13 డిపోల నుంచి 46 ప్రత్యేక బస్సులు జిల్లా కేంద్రానికి ఉదయం 8 గంటలకు చేరుకునేలా ఏర్పాటు చేశామన్నారు. అదేరోజు సాయంత్రం అనంతపురం నగరం నుంచి తిరిగి గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని కేఎ్‌సఎన్‌ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు.

Updated Date - 2020-10-03T11:42:02+05:30 IST