కరోనా కేసులు 333
ABN , First Publish Date - 2020-10-03T11:40:20+05:30 IST
జిల్లాలో శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో గడిచిన ఒక్క రోజులో కొత్తగా 333 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మరో నలుగురు బాధితులు మరణించారు.

మరో నలుగురు మృతి
అనంతపురం వైద్యం, అక్టోబరు 2: జిల్లాలో శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో గడిచిన ఒక్క రోజులో కొత్తగా 333 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మరో నలుగురు బాధితులు మరణించారు. దీంతో జిల్లా లో కరోనా బాధితుల సంఖ్య 58041కి పెరిగింది. మరణా ల సంఖ్య 495కి చేరింది. 55934 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మిగతావారు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. 43 మండలాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి.
వీటిలో అనంతపురం నగరంలోనే అత్యధికంగా 99 కేసులు వచ్చాయి. హిందూపురం 26, పుట్టపర్తి 19, కదిరి 18, ఎన్‌పీకుంట 13, తాడిపత్రి 11, బొమ్మనహాళ్, చిలమత్తూరు, ధర్మవరం 10, పెనుకొండ, రాప్తాడు 8, నల్లమాడ, నార్పల 7, లేపాక్షి, ముదిగుబ్బ, పుట్లూరు, తనకల్లు 6, గుంతకల్లు, మడకశిర, రొద్దం 5, రాయదుర్గం 4, ఏడేసి మండలాల్లో 3, 2 చొప్పున, 9 మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు చెందిన ఒకరున్నారు.