నేటి నుంచి 13వ విడత
ABN , First Publish Date - 2020-10-03T11:39:43+05:30 IST
జిల్లాలోని ఎఫ్‌పీ షాపుల్లో శనివారం నుంచి 13వ విడత ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు డీఎ్‌సఓ రఘురామిరెడ్డి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు.
ఉచిత సరుకుల పంపిణీ
అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 2: జిల్లాలోని ఎఫ్‌పీ షాపుల్లో శనివారం నుంచి 13వ విడత ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు డీఎ్‌సఓ రఘురామిరెడ్డి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విడతలో ఒక్కో కుటుంబానికి కేజీ కంది బేడలు, యూనిట్‌కు 5 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా ఇస్తామన్నారు. కార్డుదారు వేలిముద్ర వేయించుకుని, సక్రమంగా సరుకులు పంపిణీ చేయాలని డీలర్లను ఆయన ఆదేశించారు.