వైసీపీ పాలనలో రాష్ట్రం.. రావణకాష్టం..

ABN , First Publish Date - 2020-10-03T11:38:45+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం.. రావణకాష్టం..

ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి  

అనంతపురం రైల్వే, అక్టోబరు 2: వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతు దుష్మన్‌ పార్టీగా వైసీపీ చరిత్రలో నిలిచిపోతుం దన్నారు. రాష్ట్రంలో ఎవరైనా ప్రభుత్వ కార్యక్రమాలను తప్పు పడితేవారిపై కక్ష సాధింపులకు దిగుతున్నారన్నారు. ఆఖరుకు హైకోర్టు కూడా ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోందన్నారు.


కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులు కూలీలుగా మారే ప్రమా దం ఉందన్నారు. హంద్రీనీవా నీటితో చెరువులు నింపకుండా గండికోట రిజర్వాయర్‌కు తరలిస్తున్నారన్నారు. అక్కడ ముంపు బాధితులకు పరిహారం ఇవ్వకుండా ఇ బ్బంది పెడుతున్నారన్నారు. ఇది సరికాదన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు బండ్లపల్లి ప్ర తా్‌పరెడ్డి, ఉపాధ్యక్షులు వాసు, రామానాయు డు, విష్ణునారాయణ, కార్యదర్శి ఫకృద్దీన్‌, అబ్బాస్‌, మైనార్టీ నాయకులు డిస్కోబాబు, సుబహాన్‌, ఎన్‌ఎ్‌సయూఐ జిల్లా అధ్యక్షుడు రాంబాబు, నేతలు రమేష్‌, జానకమ్మ, ఆంజనేయులు, హరి, రవి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T11:38:45+05:30 IST