ముగిసిన స్కూసెట్‌

ABN , First Publish Date - 2020-10-12T11:27:24+05:30 IST

శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో పీజీ ప్రవేశాల కోసం ని ర్వహించిన స్కూసెట్‌-2020 పరీక్షలు ఆదివారంతో ముగిశాయి.

ముగిసిన స్కూసెట్‌

రేపు ఫలితాలు విడుదల


అనంతపురం అర్బన్‌, అక్టోబరు 11: శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో పీజీ ప్రవేశాల కోసం ని ర్వహించిన స్కూసెట్‌-2020 పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. ఈ నెల 7 నుంచి  ఆదివారం వరకు  29 కోర్సులకుగాను నిర్వహించిన ప రీక్షల్లో దరఖాస్తు చేసుకున్న మొత్తం 5701 మంది విద్యార్థులకు గాను  4304 మంది హాజరుకాగా 1397 మంది గైర్హాజయ్యారని స్కూసెట్‌ ముఖ్య పర్యవేక్షకులు ప్రొఫెసర్‌ శంకర్‌నాయక్‌ వెల్లడించారు.


చివరి రోజు నిర్వహించిన కామర్స్‌ పరీక్షకు 704 మందికి గాను 531 మంది, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మిన్‌కు 161కిగాను 128, హింది 22కుగాను 17, అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ 81కిగాను 56 మంది హాజరయ్యారు. మంగళవారం ఫలితాలను విడుదల చేయనున్నారు. అనంతరం ప్రవేశాల వివరాలను వెల్లడిస్తామని ఎస్కేయూ డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్‌ విభాగం వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2020-10-12T11:27:24+05:30 IST