ఇంటి పన్ను పెంపు దుర్మార్గం

ABN , First Publish Date - 2020-12-15T06:52:09+05:30 IST

రాష్ట్రంలో ఇంటి పన్ను పెంపు దుర్మార్గమని తెలుగు తమ్ముళ్లు ధ్వజమెత్తారు. సంస్కరణల పే రుతో ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు.

ఇంటి పన్ను పెంపు దుర్మార్గం

ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం

తెలుగు తమ్ముళ్ల ధ్వజం

నగర పాలక సంస్థ  కార్యాలయం వద్ద నిరసన

అనంతపురం వైద్యం, డిసెంబరు14: రాష్ట్రంలో ఇంటి పన్ను పెంపు దుర్మార్గమని తెలుగు తమ్ముళ్లు ధ్వజమెత్తారు. సంస్కరణల పే రుతో ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. ఇంటి పన్నుల పెంపు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం నిర్వహణపై సోమవారం టీడీపీ అనంత పార్లమెంటు నియోజకవర్గ విభాగాధ్వర్యంలో నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్ర కార్యదర్శులు తలారి ఆదినారాయణ, దేవళ్ల మురళి, జిల్లా కార్యదర్శి సరిపూటి రమణ, నగర అధ్యక్షుడు మారుతీగౌడ్‌ తదితరులు మాట్లాడారు. ఇంటి పన్ను అమాంతంగా పెంచటం దుర్మార్గమన్నారు. వెంటనే ఆ జీఓను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కనీసం నగరంలో ప్రజలకు తాగునీరు అందించలేకపోతున్నారనీ, పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మార్చారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో నగర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇంటి పన్ను పెంచుతూ జారీ చేసిన జీఓలను దహనం చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో అనంత పార్లమెంటు నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు ముర్షీదాబేగం, నగర అధ్యక్షురాలు విజయశ్రీ, టీడీపీ నాయకులు నారాయణస్వామియాదవ్‌, నటేష్‌ చౌదరి, కంఠా రామచంద్ర, వెంకటే్‌షగౌడ్‌, నరసింహులు, పూల బాషా, గంగవరం బుజ్జి,  డిష్‌ నాగరాజు, విద్యాసాగర్‌, బంగి నాగ, సైఫుద్దీన్‌, ముక్తియార్‌, గౌస్‌, బొమ్మినేని శివ, రఫీ, సరిపూటి శ్రీకాంత్‌, జానకి, భవాని, వసుంధర, కంఠాదేవి, మనెమ్మ, శంకరమ్మ, గౌసియా, సుమలత, రమణమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T06:52:09+05:30 IST