-
-
Home » Andhra Pradesh » Ananthapuram » atp icds story
-
ఐసీడీఎ్‌సలో ఇష్టారాజ్యం
ABN , First Publish Date - 2020-12-15T06:47:13+05:30 IST
ఐసీడీఎ్‌సకు రెగ్యులర్ పీడీ లేకపోవటం, ఇన్‌చార్జ్ పీడీగా ఉన్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి కార్యాలయానికి కూడా రాకపోవటంతో శాఖలో పరిపాలన అస్తవ్యస్తంగా సాగుతోంది.

రెగ్యులర్ పీడీ పోస్టు ఖాళీ
ఇంత వరకూ కార్యాలయానికే రాని ఇన్‌చార్జ్ పీడీ
పర్యవేక్షణ కొరవడటంతో అస్తవ్యస్తంగా పథకాలు
అనంతపురం వైద్యం, డిసెంబరు 14 : ఐసీడీఎ్‌సకు రెగ్యులర్ పీడీ లేకపోవటం, ఇన్‌చార్జ్ పీడీగా ఉన్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి కార్యాలయానికి కూడా రాకపోవటంతో శాఖలో పరిపాలన అస్తవ్యస్తంగా సాగుతోంది. అనుమతి లేకుండా సెలవులో వెళ్లిపోవటం, అంగన్‌వాడీల అక్రమాలపై అలసత్వం వహించారని రెగ్యులర్ పీడీగా ఉన్న చిన్మయదేవిని కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దీంతో పీడీ బాధ్యతలు జేసీ సిరికి అప్పగించారు. ఆమె పని ఒత్తిడిలో కార్యాలయానికే రాకపోవటంతో సిబ్బంది అవసరమైన ఫైళ్లు తీసుకెళ్లి చూపించి తీసుకొస్తున్నారు. ఏపీడీ ఉన్నా ఆఫీసును నియంత్రించలేకపోతున్నారు. దీంతో ఆఫీసులో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సమయపాలన కూడా చాలా మంది పాటించడంలేదు. ఎవరికి ఇష్టమొచ్చిన సమయంలో వారు వచ్చి వెళుతు న్నారు. క్షేత్ర స్థాయిలోనూ అంగన్‌వాడీ కేంద్రాలలో పంపిణీ చేసే పౌష్టికాహారం, గుడ్లు, పాలు ఇష్టారాజ్యంగా సరఫరా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం అక్రమాలకు పాల్పడిన ముగ్గురు అంగన్‌వాడీ కార్యకర్తలపై కలెక్టర్, జేసీ వేటు వేశారు. నలుగురు సీడీపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినా అనేక నియోజకవర్గాలలో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు ఆగడంలేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీడీఎస్ ద్వారా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ పీడీని నియమించి శాఖను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.