ఐసీడీఎస్‌ పీడీ నియామకంపై వివాదం?

ABN , First Publish Date - 2020-12-20T06:19:09+05:30 IST

ఐసీడీఎస్‌ ఇన్‌చార్జ్‌ పీడీగా విజయలక్ష్మి నియామకంపై వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఎంపీడీఓ క్యాడర్‌కు చెందిన ఆమెను పీడీగా నియమించడాన్ని ఆ శాఖలో సీనియ ర్లు ప్రశ్నిస్తున్నారు.

ఐసీడీఎస్‌ పీడీ నియామకంపై వివాదం?
కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న ఐసీడీఎస్‌ పీడీ విజయలక్ష్మి

మరొకరు వస్తారని ప్రచారం

కొనసాగుతున్న ఉత్కంఠ

అనంతపురం వైద్యం, డిసెంబరు19: ఐసీడీఎస్‌ ఇన్‌చార్జ్‌ పీడీగా విజయలక్ష్మి నియామకంపై వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఎంపీడీఓ క్యాడర్‌కు చెందిన ఆమెను పీడీగా నియమించడాన్ని ఆ శాఖలో సీనియ ర్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఐసీడీఎస్‌ ఉద్యోగుల సం ఘం రాష్ట్ర నాయకులు శుక్రవారమే రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వనిత, ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, వారు కూడా ఆ నియామకాన్ని ఆమోదించమని చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో నూతన పీడీగా విజయలక్ష్మి కొనసాగుతారా? మరొకరు ఆ స్థానానికి వస్తారా? అనే చర్చ ప్రస్తుతం ఆ శాఖలో సాగుతోంది. జిల్లా ఉన్నతాధికారిగా బాధ్యతలు ఇవ్వాలంటే ఆ స్థాయికి తగ్గట్టు క్యాడర్‌ ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయలక్ష్మి ఎంపీడీఓగా సీనియ రే.. ఇటీవల ప్రభుత్వం ఎంపీడీఓలకు స్పెషల్‌ గ్రేడ్‌ క ల్పించిన జాబితాలో ఆమె ఉన్నారు. ప్రభుత్వం నుంచి స్పెషల్‌ గ్రేడ్‌ ఉత్తర్వులు పొందలేదనీ, ఇది కూడా ఆమె నియామకానికి సమస్యగా మారవచ్చని అనుకుంటున్నారు. జిల్లా కలెక్టర్‌ స్వయంగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ పీడీగా నియమించటంతో ఆమె శుక్రవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీరించారు. ఆమె పీడీగా కొనసాగాలంటే ముఖ్య కార్యదర్శి నుంచి ఆమోద ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఆమె నియామక ఉత్తర్వులను జిల్లా ఐసీడీఎస్‌ శాఖ నుంచి రాష్ట్ర శాఖకు శుక్రవారమే పంపారు. సంఘం రాష్ట్ర నేతలు అభ్యంతరం తెలపటంతో ముఖ్య కార్యదర్శి వాటిని పక్కన పెట్టినట్లు ఐసీడీఎస్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆమె శనివారం ఐసీడీఎస్‌ కార్యాలయానికి వచ్చి, విధులు నిర్వహించారు. తనను నియమించిన జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడిని పీడీ హోదాలో మర్యాదపూర్వకంగా కలిసి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు విజయలక్ష్మి ఇన్‌చార్జ్‌ పీడీగా కొనసాగుతారా.. రాష్ట్ర అధికారులు ఈ నియామకాన్ని తిరస్కరిస్తారా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఐసీడీఎస్‌ శాఖలో దీనిపై ఉత్కంఠ సాగుతోంది.

Updated Date - 2020-12-20T06:19:09+05:30 IST