స్ర్తీనిధి అక్రమాలపై చర్యలు
ABN , First Publish Date - 2020-12-17T07:03:39+05:30 IST
స్ర్తీనిధి నిధుల అక్రమాలపై డీఆర్‌డీఏ యంత్రాంగం చర్యలు తీసుకుంది. చిలమత్తూరు మండల పరిధిలో స్ర్తీనిధి నిధులు దుర్వినియోగమైనట్లు ఆ శాఖ పీడీ నరసింహారెడ్డికి ఫిర్యాదులు అందాయి.

చిలమత్తూరు సీసీ సస్పెన్షన్
నలుగురు యానిమేటర్ల తొలగింపు
ఏపీఎంకు షోకాజు నోటీసు
అనంతపురం వ్యవసాయం, డిసెంబరు 16 : స్ర్తీనిధి నిధుల అక్రమాలపై డీఆర్‌డీఏ యంత్రాంగం చర్యలు తీసుకుంది. చిలమత్తూరు మండల పరిధిలో స్ర్తీనిధి నిధులు దుర్వినియోగమైనట్లు ఆ శాఖ పీడీ నరసింహారెడ్డికి ఫిర్యాదులు అందాయి. క్షేత్ర స్థాయిలో విచారణలో నిజాలు బయట పడ్డాయి. ఇందుకు బాధ్యులైన చిలమత్తూరు సీసీ వెం కటేశును సస్పెండ్ చేశారు. నలుగురు యానిమేటర్లను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే చిలమత్తూరు ఏపీఎంకు షోకాజు నోటీసు జారీ చేశారు. చిలమత్తూరు మండల కేంద్రంలోని ల క్ష్మి, నరసింహ, అల్లామాలిక గ్రామైక్య సంఘాలు, అదే మండల పరిధిలో ని సంజీవరాయుని పల్లెలో సంజీవరాయుని గ్రామైక్య సంఘాలకు సం బంధించి రూ.12.14 లక్షలు దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో తేల్చారు. ఇప్పటిదాకా రూ.8.90 లక్షలు రికవరీ చేయగా, ఇంకా రూ.3.24 లక్షలు రికవరీ చేయాల్సి ఉంది.