విధులకు ఆలస్యంపై కమిషనర్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-12-17T07:05:04+05:30 IST

నగరపాలక సంస్థ కార్యాలయంలో కొందరు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తరచూ విధులకు ఆలస్యంగా వస్తున్నారని నగర కమిషనర్‌ పీవీవీఎ్‌సమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధులకు ఆలస్యంపై కమిషనర్‌ ఆగ్రహం

 కార్పొరేషన్‌ ఉద్యోగులు, సిబ్బంది 16 మందికి మెమోలు జారీ

అనంతపురం కార్పొరేషన్‌, డిసెంబరు 16: నగరపాలక సంస్థ కార్యాలయంలో కొందరు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తరచూ విధులకు ఆలస్యంగా వస్తున్నారని నగర కమిషనర్‌ పీవీవీఎ్‌సమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 మందికి మెమోలు జారీ చేశారు. ఆయన బుధవారం ఉదయం 10.30 గంటలకు కార్పొరేషన్‌ కార్యాయానికి వెళ్లా రు. కొందరు అధికారులు, ఉద్యోగుల హాజరుకానట్లు తెలిసింది.  మెయిన్‌ హాల్‌కు వెళ్లి హాజరు పట్టికను పరిశీలించారు. తక్కువ మంది సం తకాలు చేసినట్లు గుర్తించారు. ప్రధానంగా ఉండాల్సిన మేనేజర్‌ లక్ష్మీ దేవి, సూపరింటెండెంట్లు విజయ్‌కు మార్‌(అకౌంట్స్‌), ఖయ్యూమ్‌(ఇంజనీరింగ్‌), సాలమ్మ(మెప్మా), దేవశంకర్‌(హెల్త్‌), సంధ్య(పింఛన్‌)  కనిపించకపోవడంతో కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  వారితో పాటు మొత్తం 16మందికి మెమోలు జారీ చేశారు. 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. మెమోలు అందుకున్న వారిలో సీనియర్‌ అసిస్టెంట్లు సుగుణ, పెద్దక్క, సునీల్‌, కుళ్లాయప్ప, జూనియర్‌ అసిస్టెంట్లు క్రిష్ణమూర్తి, శరత్‌బాబు, దుర్గాంజలి, వన్నూరప్ప, రఘునాథరెడ్డి, రికార్డ్‌ అసిస్టెంట్‌ శివశంకర్‌ ఉన్నారు. 

Updated Date - 2020-12-17T07:05:04+05:30 IST