అర్హులందరికీ ఇంటి పట్టాలివ్వాలి

ABN , First Publish Date - 2020-12-30T06:20:23+05:30 IST

అర్హులై న ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలివ్వాలని జిల్లా కలెక్టర్‌ గం ధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు.

అర్హులందరికీ ఇంటి పట్టాలివ్వాలి

అధికారులకు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశం

అనంతపురం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): అర్హులై న ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలివ్వాలని జిల్లా  కలెక్టర్‌ గం ధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వలంటీర్లను ప్రతి ఇంటికీ పంపి, పరిశీలించి అర్హులకెవరికైనా పట్టా రాకుంటే.. వారికి 90 రోజుల్లో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం సంబంఽధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జనవరి 7 వరకూ ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఇంటిపట్టా రాలేదని ఎవరైనా అడిగితే.. వారికెందుకు రాలేదో వీఆర్వో, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు సమాధా నం చెప్పేలా స్పష్టమైన వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా లో కొన్నిచోట్ల అర్హత ఉన్నా.. పట్టాలివ్వకుండా ప్రభుత్వ భూమి ఉన్న మేరకు మాత్రమే పంపిణీ చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలా కాకుండా అర్హులైన వారికి ప్రైవేటు భూమి కొనుగో లు చేసైనా పట్టాలివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించా రు. అర్హత ఉన్నా.. పట్టాలివ్వకపోతే సంబంధిత తహసీల్దార్‌, వీఆర్వోపై చర్యలు తీసుకునేందుకు వెనకాడనని హెచ్చరించారు.  కలెక్టర్‌ టెలీ కాన్ఫరెన్స్‌లో జేసీలు నిశాంత్‌కుమార్‌, డాక్టర్‌ సిరి, సబ్‌ కలెక్టర్‌ నిశాంతి, హౌసింగ్‌ పీడీ, ప్రత్యేకాధికారులు, ఆర్డీఓలు, త హసీల్దార్లు, గృహనిర్మాణ శాఖాధికారులు, ఏపీడీలు, ఏపీఓలు, వీఆర్వోలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T06:20:23+05:30 IST