కొత్తగా 31 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-28T06:21:24+05:30 IST

కొత్తగా 31 కరోనా కేసులు

కొత్తగా 31 కరోనా కేసులు

అనంతపురం వైద్యం, డిసెంబరు27: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో అనంతపురంలో 16, పుట్టపర్తి 4, హిందూపురం 3, ధర్మ వరం, కదిరి, తనకల్లు 2, చిలమత్తూరు 1, కర్నూలుకు సం బంధించి ఒక కేసు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధి తుల సంఖ్య 67279కి చేరింది. ఇందులో 66525 మంది కోలుకోగా.. 158 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో వైరస్‌తో ఎవరూ చనిపోలేదు. దీంతో కరోనా మరణాల సంఖ్య 596 వద్ద నిలకడగా ఉంది.

Read more