అనంతపురం జిల్లాలో.. కొత్తగా 17 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-13T06:30:35+05:30 IST

జిల్లాలో గడిచిన ఒక్క రోజులో 17 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఎవరూ మరణించలేదు. జిల్లావ్యాప్తంగా ఏడు మండలాల్లో కొత్త కేసులు వచ్చాయి.

అనంతపురం జిల్లాలో.. కొత్తగా 17 కరోనా కేసులు

అనంతపురం వైద్యం, డిసెంబరు12: జిల్లాలో గడిచిన ఒక్క రోజులో 17 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఎవరూ మరణించలేదు. జిల్లావ్యాప్తంగా ఏడు మండలాల్లో కొత్త కేసులు వచ్చాయి. పుట్టపర్తి 7, అనంతపురం 4, మడకశిర 2, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, నల్లమాడ మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 66989 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 594 మంది మరణించగా.. 66202 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం 193 మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-12-13T06:30:35+05:30 IST