జిల్లాలో 13 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-20T06:17:59+05:30 IST

జిల్లాలో గడిచిన ఒక్క రోజులో కొత్తగా 13 కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మండలాల్లో ఈ కేసులు బయటపడ్డాయి.

జిల్లాలో 13 కరోనా కేసులు

అనంతపురం వైద్యం, డిసెంబరు 19: జిల్లాలో గడిచిన ఒక్క రోజులో కొత్తగా 13 కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మండలాల్లో ఈ కేసులు బయటపడ్డాయి. అందులో పుట్టపర్తి 4, అనంతపురం, బుక్కరాయసముద్రం, ధర్మవరం, గుత్తి, కదిరి, లేపాక్షి, నల్లచెరువు, నల్లమాడ, రాయదుర్గం మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 67121కి చేరింది. వీరిలో 595 మం ది ప్రాణాలు కోల్పోగా.. 66377 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం  149 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-12-20T06:17:59+05:30 IST