-
-
Home » Andhra Pradesh » Ananthapuram » atp banner story for house sites
-
ఇళ్ల పట్టాలు రివర్స్..!
ABN , First Publish Date - 2020-12-27T06:49:54+05:30 IST
భివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రివర్స్..

చెరువులో ఇళ్ల స్థలాలు వద్దన్న లబ్ధిదారులు
పట్టాలు వాపసు ఇచ్చిన వైనం
ఇంటి పట్టా కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన ఆటో డ్రైవర్
చంద్రన్న ఇచ్చాడన్న మహిళ
అవాక్కయిన ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, సిద్దారెడ్డి
అనంతపురం(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ తరహాల్లో ఇళ్ల పట్టాల పంపిణీలో లబ్ధిదారులూ రివర్స్ గేర్ వేశారు. చెరువులో ఇళ్ల పట్టాలివ్వటంతో నీరు వచ్చినపుడు మునిగి, చావాలా అంటూ ఏకంగా ఇళ్ల పట్టాలనే వెనక్కిచ్చేశారు. దీంతో పట్టాలను పంపిణీ చేసిన వెంటనే అధికారులు, వైసీపీ నాయకులు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
చెరువులో ఇల్లు కట్టి చెడిపోవాలా..?
చెరువులో ఇల్లు కట్టి చెడిపోవాలా అంటూ మండలంలోని అరమడకవారిపల్లిలో పట్టాలు తీసుకున్న లబ్ధిదారులు వెనక్కిచ్చేశారు. గాండ్లపెంట మండలం అరమడకవారిపల్లిలో పట్టాలు పంపిణీ చేసేందుకు వచ్చిన అధికారులకు లబ్ధిదారులు లేఅవుట్ వేసిన స్థలాన్ని చూసి, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపిక చేసిన స్థలం చెరువులో ఉందనీ, నీరు వస్తే మునిగి పోతుందని సంబంధిత అధికారులకు మొదట్నుంచీ మొరపెట్టుకున్నా వినలేదన్నారు. గ్రామంలో 20 ఇళ్లకు సరిపడా అనువైన స్థలం ఉన్నా.. ఇంటి పట్టాలివ్వకుండా చెరువులో ఇచ్చి అన్యాయం చేసేలా చూస్తున్నారని లబ్ధి దారులు సరస్వతి, హరినాథ్‌రెడ్డి, సుశీలమ్మ, గీత, రెడ్డెప్ప రెడ్డి అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు నీట మునగకుండా ఎత్తుచేసి, ఇంటి నిర్మా ణాలు చేపడతామని సర్దిచెప్పి పట్టాలు లబ్ధిదారులకు అందించినా.. తమకు వద్దంటూ వెనక్కిచ్చేశారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వెనుతిరిగి వచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ శ్రీరాములు, వైసీపీ మండల కన్వీనర్ చంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
నమ్మించి మోసం..
రెవెన్యూ అధికారులు తమను నమ్మించి, మోసం చేశారని అనంతపురంరూరల్ మండలం కొడిమిలో ఇళ్ల పట్టాలకు భూములిచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసమని రెవెన్యూ అధికారులు కొడిమిలో 28 మంది రైతులకు సంబంధించిన 115 ఎకరాల భూమిని ఎకరం రూ.28లక్షలతో తీసుకున్నారు. ఇందులో 42.63 ఎకరాలకు సంబంధించిన 14 మంది రైతులకు పరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. అదేమిటంటే ఆ భూములకు పట్టాలు లేవనీ, ఎకరాకు రూ.14లక్షలు ఇస్తామని చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు తీసుకునేటపుడు ఎకరాకు రూ.28లక్షలు చెల్లిస్తామని ఆర్డీఓ నమ్మబలికి, ఇప్పుడు మాట మార్చటం సరికాదని రైతులు ఇబ్రహీం, సాంబశివ, నా గార్జున, జింకా సూర్యనారాయణ, లింగారెడ్డి, సూర్యనారాయణ, సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ మద్దతుదారుల ధర్నా
నార్పల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైసీపీ మద్దతుదారులు.. అర్హులకు ఇంటి స్థలాలివ్వాలని రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. జాబితాలోని 300 మందిని తొలగించారన్నారు. అందులో ఎంతోమంది అర్హులున్నారనీ, వెంటనే వారందరికీ ఇంటి పట్టాలివ్వాలని తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. కార్యక్రమంలో వైసీపీ మద్దతుదారులు చికెన్ గోపాల్, ప్రభుదాస్, నాగరాజు, రమేష్, బాలాజీ పాల్గొన్నారు.
పట్టా ఇవ్వలేదని..
అర్హుడినైన తనకు ఇంటి పట్టా ఇవ్వలేదని ఆటో డ్రైవర్ గార్లదిన్నెలో వాటర్ ట్యాంకు ఎక్కి, నిరసన తెలిపాడు. మండలంలోని బూదేడు గ్రామ వాసి దళిత నల్లయ్య ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటు న్నాడు. అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇంటి పట్టా కోసం పలుమార్లు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నా క్షేత్రస్థాయిలో కొందరు నాయకులు అడ్డుపడ్డారు. తనకు పట్టా మంజురు కాకపోతే మరణమే శరణ్యమనీ, ఆత్మహత్య చేసుకుంటానని వాటర్ ట్యాంకు పైనే భీష్మించాడు. ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌రెడ్డి అక్కడికి చేరుకుని తహసీల్దార్‌తో మాట్లాడి ఇంటి పట్టా ఇప్పిస్తానని హామీ ఇవ్వటంతో నల్లయ్య కిందకు దిగొచ్చాడు.

ఎమ్మెల్యేలకు షాక్
జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీలో లబ్ధిదారుల నుంచి అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు వింత అనుభవం ఎదురైంది. యాడికిలో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లారు. నాగమ్మ అనే లబ్ధిదారురాలికి పట్టా అందజేశారు ఈ పట్టా ఎవరిచ్చారమ్మా అని ఎమ్మెల్యే.. ఆమెను అడిగారు. ‘చంద్రన్న సారు పట్టా ఇచ్చార’ని ఆమె చెప్పటంతో ఎమ్మెల్యే పెద్దారెడ్డితోపాటు అక్కడున్న వైసీపీ నాయకులంతా అవాక్కయ్యారు. దీం తో పార్టీ శ్రేణులు నాగమ్మకు జగనన్న ఇచ్చారని చెప్పమనడంతో ఎమ్మెల్యే రెండోసారి ప్రశ్నించారు. జగనన్న ఇచ్చాడని ఆమె బదులిచ్చింది. ఈ ఘటనతో అక్కడున్న అధికార పార్టీ శ్రేణులతోపాటు లబ్ధిదారులు ఇంకా చంద్రన్నను మర్చిపోయినట్లు లేరని చర్చించుకోవటం కనిపించింది. కదిరి నియోజకవర్గంలోనూ స్థానిక ఎమ్మె ల్యే సిద్దారెడ్డి ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు. తనకల్లు మండలంలో పట్టాను చంద్రబాబు ఇచ్చినట్లుగా ఓ లబ్ధిదారురాలు చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అ య్యింది. ఎమ్మెల్యే ఓ మహిళకు ఇంటి పట్టా పంపిణీ చేశారు. ఈ సమయంలో అక్కడ ఉన్న స్థానిక ఎంపీడీ ఓ పూల నరసింహులు.. పట్టా ఎవరిచ్చారని ప్రశ్నించగా చంద్రబాబునాయుడు అని చెప్పటంతో అక్కడున్న ఎ మ్మెల్యే, ఇతరులు షాక్ అయ్యారు.

లేఅవుట్ల వద్దే పట్టాలివ్వండి
అనంతపురం: లబ్ధిదారులకు లేఅవుట్ల వద్దే ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రు డు.. అధికారులను ఆదేశించారు. ఎవరికి కేటాయించిన స్థలంలోనే వారికి పట్టా అందించాలన్నారు. శనివారం ఆయన సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంటిపట్టాలతోపాటు ఇళ్ల నిర్మాణం ప్రొసీడింగ్స్ ఇవ్వాలన్నారు. ఆ మేరకు నివేదికలు తనకు అందజేయాలని హౌసింగ్ పీడీతోపాటు ప్రత్యేక అధికారులను ఆదేశించారు. రోజూ ఇంటిపట్టాల పంపిణీపై సా యంత్రం 6 గంటల్లోపు నివేదికలు అందాలన్నారు. పట్టాలిచ్చేందుకు ఎవరైనా డబ్బు అడిగినా.. మళ్లీ ఇస్తామని చెప్పినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లయితే అదేరోజు పనులు ప్రారంభించాలన్నారు. ఇందుకు సంబంధిం చి ఇంజనీరింగ్, డిజిటల్, గ్రామాల్లో వెల్ఫేర్, మున్సిపాల్టీల్లో కమ్యూనిటీ అసిస్టెంట్లు.. లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో అడిగి తెలుసుకోవాలన్నారు. ఆ మేరకు సహాయ సహకారాలు అందించాలన్నారు.
లబ్ధిదారులకు సంబంధించి ఇళ్ల నిర్మాణాల విషయంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే దానిని తెలియజేసేందుకు టోల్ ఫ్రీ నెంబరు 1902ను వినియోగించుకోవా లన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూమిపూజ కార్యక్రమంలో ఆయా మతాల సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జేసీలు నిశాంత్‌కుమార్, డాక్టర్ సిరి, సబ్ కలెక్టర్ నిశాంతితోపాటు హౌసింగ్ పీడీ, ప్రత్యేకాధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, గృహనిర్మాణ శాఖాధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వీఆర్వోలు, సర్వేయర్లను కలెక్టర్ అభినందించారు.
