‘అమ్మఒడి’ లబ్ధిపొందిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-12-25T07:04:44+05:30 IST

అమ్మఒడి ద్వారా లబ్ధిపొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని డీఈఓ శామ్యూల్‌ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

‘అమ్మఒడి’  లబ్ధిపొందిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

అనంతపురం విద్య, డిసెంబరు 24 : అమ్మఒడి ద్వారా లబ్ధిపొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని డీఈఓ శామ్యూల్‌ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖాధికారులు తెలిపిన మేరకు... జిల్లాలోని బుక్కపట్నం మండలం ఎర్రంపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఎస్‌జీటీ సురే్‌షబాబు తన కుమారుడికి అమ్మఒడి పథకం కింద దరఖాస్తు చేశాడు. ఆయన గత ఏడాది దరఖాస్తు చేసి, రూ. 15 వేలు లబ్ధి పొందాడు. ఈ ఏడాది కూడా దరఖాస్తు చేసుకుని, అర్హుల జాబితాలో చోటు పొందాడు. అయితే పలువురు అనర్హులకు అమ్మఒడి అర్హుల మొదటి జాబితాలో చోటు కల్పించడంపైౖ ఈనెల 23న ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. విచారణ చేసిన అధికారులు ఆ ఉపాధ్యాయుడి కుమారుడిని అనర్హుడిగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిపొందడంపై ఆ ఉపాధ్యాయుడిపై డీఈఓ సస్పెన్షన్‌వేటు వేశారు.

Updated Date - 2020-12-25T07:04:44+05:30 IST