‘అమ్మఒడి’కి సర్వర్ టెన్షన్
ABN , First Publish Date - 2020-12-15T06:45:35+05:30 IST
అమ్మఒడికి సర్వర్ క ష్టాలు వెంటాడుతున్నాయి. చైల్డ్‌ఇన్ఫోలో విద్యార్థుల వివరాలను న మోదు చేసేందుకు ప్రధానోపాధ్యాయులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
చైల్డ్ ఇన్ఫోలో నమోదుకు సమస్యలు
ఉదయం నుంచి సర్వర్ బిజీ
నేటితో ముగియనున్న గడువు
టీసీ ఇవ్వని ప్రైవేట్ పాఠశాలలు
16న మొదటి అర్హుల జాబితా
అనంతపురం విద్య, డిసెంబరు 14: అమ్మఒడికి సర్వర్ క ష్టాలు వెంటాడుతున్నాయి. చైల్డ్‌ఇన్ఫోలో విద్యార్థుల వివరాలను న మోదు చేసేందుకు ప్రధానోపాధ్యాయులకు చుక్కలు కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి సా యంత్రం వరకూ సర్వర్ సతాయించటంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఆఖరు రోజు కావటంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో టెన్షన్ గంటగంటకూ పెరుగుతోంది. ఈ ఏడాది అమ్మఒడికి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. వందలాది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఇటీవల కొవిడ్-19 నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చిన వారిని టీసీలు లేకున్నా చేర్చుకోవాలంటూ ఆదేశాలిచ్చారు. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో భారీగా ప్రైవేట్, కార్పొరేట్ నుంచి వచ్చి చేరారు. ప్రస్తుతం చైల్డ్‌ఇన్ఫోలో ఆ పిల్లల వివరాలు నమోదు చేయాలంటే వారు గతంలో చదివిన ప్రైవేట్ స్కూళ్ల జాబితా నుంచి తొలగించాలి. ఆ పిల్లల ఫీజుల పెండింగ్ ఇతర సమస్యలు సాకుగా చూపుతూ చాలా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు టీసీలు జారీ చేయకపోవటంతో సమస్య జఠిలమవుతోంది. ఇటీవల కొన్ని బ్యాంకులను విలీనం చేశారు. వాటి ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌లు మారటం కూడా సమస్యగా పరిణమించిందని ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నేడే ఆఖరు
2020-21 ఏడాదికి సంబంధించి అమ్మఒడి పథకం వర్తింపులో భాగంగా చైల్డ్ ఇన్ఫోలో వివరాల నమోదుకు ఈనెల 10 నుంచి 15వ తేదీ వరకూ గడువిచ్చారు. సోమవారం ఉదయం నుంచి చైల్డ్‌ఇన్ఫో సైట్ ఓపెన్ కాకపోవటంతో పిల్లల వివరాల నమోదుకు అవస్థలు పడ్డారు. బుధవారం తొలి అర్హుల జాబితా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో వివరాల న మోదుకు మంగళవా రం ఆఖరిరోజు కావటంతో పాఠశాలల యా జమాన్యాలు, పిల్లల తల్లిదండ్రుల్లో టెన్షన్ పెరుగుతోంది. పలు ప్రై వేట్, కార్పొరేట్ స్కూళ్లకు సైతం యూడైస్ కోడ్‌లు రాకపోవటం, సర్వర్ బిజీ నేపథ్యంలో అమ్మఒడి నమోదు గడువు నెలాఖరు వరకూ పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు.