పనిచేయని ఏటీఎంలు

ABN , First Publish Date - 2020-03-08T11:43:00+05:30 IST

మండల కేంద్రంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం, ఇండియా ఏటీఎంలు రెండూ పనిచేయక పోవడంతో వినియోగదారులు ఇబ్బం దులకు గురవుతున్నా రు. పది రోజుల

పనిచేయని ఏటీఎంలు

  • ఇబ్బందుల్లో వినియోగదారులు 

కంబదూరు: మండల కేంద్రంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం, ఇండియా ఏటీఎంలు రెండూ పనిచేయక పోవడంతో వినియోగదారులు ఇబ్బం దులకు గురవుతున్నా రు. పది రోజుల నుంచి ఈ రెండు ఏటీఎంలోను ఔట్‌ ఆఫ్‌ సర్వీస్‌ అని స్ర్కీన్‌ మీద డిస్‌ప్లే అవుతోంది.  వారం రోజుల నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ సంబంధిత అధికా రులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. దీంతో డబ్బులు డ్రా చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా వచ్చిన వినియో గదారుల కు నిరాశే ఎదురవుతోంది. ఇంత పెద్ద మండల కేంద్రంలో ప్రతిసారి ఇటువంటి సమస్యే తలెత్తుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఏటీఎంలను బాగు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. 

Updated Date - 2020-03-08T11:43:00+05:30 IST