జిల్లాకు ఇద్దరు ఐఏఎస్‌ల నియామకం

ABN , First Publish Date - 2020-05-11T10:21:25+05:30 IST

రాష్ట్రంలో 27 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభు త్వం ఆదివారం ఉత్తర్వులు

జిల్లాకు ఇద్దరు ఐఏఎస్‌ల నియామకం

జేసీలుగా నిశాంత్‌కుమార్‌, లావణ్యవేణి

గుంటూరు జేసీగా నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రశాంతి బదిలీ

ప్రభుత్వానికి రిపోర్టు చేసుకోవాలని జేసీ ఢిల్లీరావుకు ఆదేశం


అనంతపురం,మే 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో  27 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభు త్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగం గా జిల్లా రైతు భరోసా, రెవెన్యూ జేసీగా నిశాంత్‌ కుమార్‌ను నియమించారు. ఈయన 2014 బ్యాచ్‌కు చెం దిన ఐఏఎస్‌ అధికారి. తూర్పుగోదావరి జిల్లాలోని రంప చోడవరంలో ఐటీడీఏ పీఓగా పనిచేస్తు ఈయన్ను ఇక్క డికి బదిలీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల అభి వృద్ధి జేసీగా లావణ్యవేణిని నూతనంగా నియమించారు. ఈమె కూడా 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారే. ఎంప్లాయ్‌మెంట్‌ ట్రైనింగ్‌ డైరెక్టర్‌గా విజయవాడలో పని చేస్తున్న ఆమె బదిలీపై ఇక్కడికి రానున్నారు. వీరి ద్దరూ రెండ్రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నట్లు కలెక్టరేట్‌ వర్గాల ద్వారా  సమాచారం అందింది. 


ఢిల్లీరావు బదిలీ

జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి ఢిల్లీరావు బదిలీ అయ్యారు. అయితే ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా ప్రభుత్వానికి రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. గతేడాది మేలో జాయింట్‌ కలెక్టర్‌గా జేసీ ఢిల్లీరావు బాధ్యతలు చేపట్టారు. విధి నిర్వహణలో ఏ పని అప్పగించినా జిల్లా అధికారులను సమన్వయం చేసుకుం టూ పని చేయడంలో తనదైన ముద్రను వేశారు. జాయింట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే ఐఏఎస్‌ శిక్షణ కోసం జూలైలో ముస్సోరికి వెళ్లారు. శిక్షణ పూర్తైన తర్వాత విధుల్లో చేరారు. దాదాపు ఏడాదిపాటు ఆయన జిల్లాలో పనిచేశారు. అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రశాంతి, జేసీ ఢిల్లీరావు దంపతులు. వీరిద్దరూ ప్రస్తుతం జిల్లా నుంచి బదిలీ కావడం గమ నార్హం.  


గుంటూరు జేసీగా ప్రశాంతి బదిలీ

అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌, అహుడా వైస్‌చైర్మన్‌గా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి ప్రశాంతి బది లీ అయ్యారు. ఆమెను గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా నియమించారు. అనం తపురం నగర కమిషనర్‌గా ప్రశాంతి గతేడాది జూన్‌ 27న బాధ్యతలు చేపట్టారు. అక్రమ కట్టడాలపై ఆమె కొ రడా ఝుళిపించారు. ఈ క్రమంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ఆమె కొరకరాని కొయ్యగా మారారు. ఈ నేపథ్యంలోనే ఆమె కొన్ని రోజులకే సెలవుపై వెళ్లాల్సి వ చ్చింది. ఇదే సందర్భంలో ఐఏఎస్‌ శిక్షణ కోసం జూలై 6న ముస్సోరికి వెళ్లారు. అక్కడ శిక్షణ పూర్తి చేసుకుని ఆగస్టు 18న అనంతపురం వచ్చారు. 21న తిరిగి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నవంబరు వరకూ పనిచేశారు. ఆ తరువాత అదే నెలలో 16 నుంచి ఐదు నెలలపాటు దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ఏప్రిల్‌ 22న తిరిగి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆమె గుంటూరు జేసీగా బదిలీ అయ్యారు.

Updated Date - 2020-05-11T10:21:25+05:30 IST