అనంతపురం జట్టు భారీ స్కోరు

ABN , First Publish Date - 2020-12-27T06:24:36+05:30 IST

అనంత ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌)లో అనంతపురం జట్టు భారీ స్కోరు చేసింది. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌తో అ ర్ధాంతరంగా ముగిసిన ఈ పోటీలు శనివారం తిరిగి స్థానిక అనంత క్రీడాగ్రామ ంలో ప్రారంభమయ్యా యి.

అనంతపురం జట్టు భారీ స్కోరు

సెంచరీలతో చెలరేగిన బ్యాట్స్‌మెన్‌.. 

ఏపీఎల్‌ పోటీలు పునఃప్రారంభం

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 26: అనంత ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌)లో అనంతపురం జట్టు భారీ స్కోరు చేసింది. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌తో అ ర్ధాంతరంగా ముగిసిన ఈ పోటీలు శనివారం తిరిగి స్థానిక అనంత క్రీడాగ్రామ ంలో ప్రారంభమయ్యా యి. మొదటి సెమీఫైనల్‌లో టాస్‌గెలిచిన ఆత్మకూరు ఫీ ల్డింగ్‌ ఎంచుకుంది. బ్యా టింగ్‌కు దిగిన అనంతపు రం జట్టు 90 ఓవర్లలో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 510 పరుగులు సాధించింది. ఇందులో కెప్టెన్‌ యోగానంద (154 బంతుల్లో 19 ఫోర్లు, సిక్సర్‌తో 135), హరినాథ్‌ (135 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్లతో 134), అశోక్‌రెడ్డి (128 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో 113) సెంచరీలతో కదం తొక్కారు. ఆత్మకూరు బౌలర్‌ రూపే్‌షకుమార్‌ 5, ఖాదర్‌వలీ 3 వికెట్లు పడగొట్టారు. రెండో సెమీ స్‌లో టాస్‌ గెలిచిన కదిరి జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రాప్తాడు జట్టు 89.5 ఓవర్లలో 362 పరుగులకు ఆలౌటైంది. ఇందులో దత్తారెడ్డి (171 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 134), మహేంద్రరెడ్డి (79) సత్తాచాటారు. అంతకుముందు ఏపీఎల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షకార్యదర్శులు పగడాల మల్లికార్జున, మధుసూదనాచారి మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించి, నైపుణ్యతను వెలికితీసేందుకు ఆర్డీటీతో కలి సి ఏపీఎల్‌ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రా రంజీ జట్టు సెలెక్షన్‌ కమి టీ చైర్మన్‌ షాబుద్దీన్‌, మాజీ రంజీ క్రీడాకారుడు సురేష్‌, జిల్లా క్రికెట్‌ సంఘం కోశాధికారి మురళీకృష్ణ, ఏపీఎల్‌ చైర్మన్‌ చంద్రమోహన్‌రెడ్డి, కోచైర్మన్‌ రవికాంత్‌, సభ్యులు నజీర్‌అహ్మద్‌, కోచ్‌లు పాల్గొన్నారు.



Updated Date - 2020-12-27T06:24:36+05:30 IST