మరో కరోనా అనుమానిత కేసు నమోదు

ABN , First Publish Date - 2020-03-24T10:34:12+05:30 IST

కళ్యాణదుర్గం ప్రాంతంలో మరో కరోనా అనుమానిత కేసు నమోదైంది. కరోనా లక్షణాలు ఉన్న ఓ మహిళను ప్రత్యేక అంబులెన్స్‌లో సోమవారం జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు.

మరో కరోనా అనుమానిత కేసు నమోదు

కళ్యాణదుర్గం, మార్చి 23 : కళ్యాణదుర్గం ప్రాంతంలో మరో కరోనా అనుమానిత కేసు నమోదైంది. కరోనా లక్షణాలు ఉన్న ఓ మహిళను ప్రత్యేక అంబులెన్స్‌లో సోమవారం జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. కుందుర్పి మండలం అపిలేపల్లికి చెందిన ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి కేరళ ప్రాంతానికి వలస వెళ్లింది. పది రోజుల క్రితం  స్వగ్రామం వచ్చింది. అప్పటి నుంచి ఆ మెకు దగ్గు, జ్వరం, కీళ్ల నొప్పులు మొదలయ్యా యి. ఆమె చికిత్స నిమిత్తం భర్తతో కలిసి కళ్యా ణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి వచ్చింది. తాము వలస వెళ్లి వచ్చామని వైద్యులకు తెలియజేయడంతో స్థానిక వైద్యులు కరోనా అనుమానిత కేసుగా భావించి జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్‌ వార్డుకు సమాచారం అందించారు. వ్యాధి నిర్ధారణ నిమిత్తం ప్రత్యేక అంబులెన్స్‌లో జిల్లా కేంద్రానికి తరలించారు.

Read more