ఆస్పత్రిలో దారుణాలపై ఎమ్మెల్యే ఆగ్రహం

ABN , First Publish Date - 2020-07-28T18:33:30+05:30 IST

జిల్లా సర్వజనాస్పత్రిలో దారుణాలపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాలపై..

ఆస్పత్రిలో దారుణాలపై ఎమ్మెల్యే ఆగ్రహం

పరిస్థితుల్లో మార్పు రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు...

కరోనా బాధితులకు మానవతా దృక్పథంతో 

వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచన


అనంతపురం: జిల్లా సర్వజనాస్పత్రిలో దారుణాలపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాలపై అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సీరియ్‌సగా స్పం దించారు. సోమవారం ఆయన నేరుగా ఆస్పత్రికొచ్చారు. కొవిడ్‌ విభాగాలకు వెళ్లి, చికిత్సలు పొందుతున్న కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో వసతులు, వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కొందరు కరోనా బాధితులు చనిపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో వరుస ఘటనలు తనను ఎంతగానో కలచి వేశాయన్నారు. ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్నా.. ఆక్సిజన్‌ అం దక కరోనా బాధితులు చనిపోవటం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్పత్రిలో పరిస్థితుల్లో మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యులు మానవతాదృక్పథంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ సూర్య, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామస్వామినాయక్‌, నోడల్‌ అధికారి డాక్టర్‌ నవీద్‌అహ్మద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-07-28T18:33:30+05:30 IST