వాస్తవ నివేదికలివ్వని పర్యవసానం

ABN , First Publish Date - 2020-11-04T06:37:28+05:30 IST

వాస్తవ నివేదికలివ్వటంలో విఫలమైన నేపథ్యంలో ప ంచాయతీరాజ్‌, వ్యవసాయం, గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు మంగళవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

వాస్తవ నివేదికలివ్వని పర్యవసానం
జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు

మూడు శాఖల ఉన్నతాధికారులకు కలెక్టర్‌ షాక్‌

షోకాజ్‌ నోటీసులు జారీ

అనంతపురం, నవంబరు3(ఆంధ్రజ్యోతి): వాస్తవ నివేదికలివ్వటంలో విఫలమైన నేపథ్యంలో ప ంచాయతీరాజ్‌, వ్యవసాయం, గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు మంగళవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో ఈనెల 2న నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి చాలా ప్రాంతాల్లో పనులు ప్రారంభించలేదని ప్రజాప్రతినిధులు జిల్లా ఇనచార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీరాజ్‌ శాఖాధికారులు మాత్రం 800 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయనీ, అన్నిచోట్లా పనులు ప్రారంభమయ్యాయని ఆనలైనలో అప్‌లోడ్‌ చేశారు. ఆ నివేదికలను జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని గ్రహించిన కలెక్టర్‌ తీవ్రంగా పరిగణించారు. పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ మహేశ్వరయ్యకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. జిల్లాలోని 800 రైతు భరోసా కేంద్రాలకు స్థలాలు అప్పగించారని నివేదిక ఇచ్చిన వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ.. డీఆర్సీ సమావేశంలో మాత్రం సైట్లు అప్పగించలేదని చెప్పటంతో ఆయనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పథకం కింద మున్సిపల్‌ కమిషనర్ల సమన్వయంతో ఇళ్ల స్థలాల లెవలింగ్‌ బిల్లుల సమాచారం తెప్పించుకోలేదని హౌసింగ్‌ పీడీ బాల వెంకటేశ్వరరెడ్డికి  షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వీరు మూడ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ ఆ నోటీసుల్లో ఆదేశించారు.

Updated Date - 2020-11-04T06:37:28+05:30 IST