-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Ananthalakshmi students selected for Tata Consultancy
-
టాటా కన్సల్టెన్సీకి అనంతలక్ష్మి విద్యార్థుల ఎంపిక
ABN , First Publish Date - 2020-12-29T05:29:40+05:30 IST
అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

అనంతపురం ప్రెస్‌క్లబ్, డిసెంబరు28: అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. టాటా కన్సల్టెన్సీ(టీసీఎస్) కంపెనీలో 29 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ మూర్తిరావ్ ఖోకలే పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కళాశాలలో ఎంపికైన విద్యార్థులను చైర్మన అనంతరాముడు అభినందించారు. ఆయన మాట్లాడుతూ కళాశాలలో ఎంతో మంది విద్యార్థులు విధ్యనభ్యసించి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. ఈసారి కూడా కంప్యూటర్ సైన్స చదువుతున్న విద్యార్థి జయసింహను అత్యధిక వార్షిక వేతనం రూ.7 లక్షలతో కంపెనీ ఎంపిక చేసిందన్నారు. అదే విధంగా ఈసీఈ, సీఎ్‌సఈ, ఈఈఈ చదువుతున్న 23 మంది విద్యార్థులను రూ.4 లక్షల వార్షిక వేతనంతో టీసీఎస్ కంపెనీ ఉద్యోగానికి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఎంపికైన విద్యార్థులను వైస్ ఛైర్మన రమే్‌షనాయుడు, స్కిల్ డెవల్‌పమెంట్ సంచాలకులు సురేంద్రనాయుడు, అధ్యాపకులు అభినందిస్తూ కేక్ కట్ చేశారు.