ఘనంగా కాళేశ్వర్ వర్ధంతి
ABN , First Publish Date - 2020-03-16T10:30:39+05:30 IST
ఘనంగా కాళేశ్వర్ వర్ధంతి
పెనుకొండ, మార్చి 15: స్థానిక షిర్డీసాయి గ్లోబల్ ట్రస్టు మాజీ చైర్మన్, శివసాయి మందిరం వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సాయికాళేశ్వర్ 8వ వర్ధంతి గ్లోబల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శివసాయి మందిరం ప్రాంగణంలోని కాళేశ్వర్ సమాధిని ఆదివారం వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. గ్లోబల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ శిల్ప, కాళేశ్వర్ కుమార్తె నవ్యశ్రీ, భాస్కర్‌రెడ్డి, బంధువులు, ఆశ్రమ సిబ్బంది, నిర్వాహకులు నాగిరెడ్డి, చిట్టిబాబు, హరి, బాబు తదితరులు ఆయన సమాధికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విదేశీ భక్తులు భక్తిగీతాలు ఆలపించారు. పుర ప్రముఖులు, ప్రజలు పెద్దఎత్తున హాజరై సమాధిని దర్శించుకుని నివాళులర్పించారు.