నమో నారసింహా !
ABN , First Publish Date - 2020-03-16T10:24:28+05:30 IST
నమో నారసింహా !
అంగరంగ వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మరథోత్సవం
గోవింద నామస్మరణతో మార్మోగిన కదిరి
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
4.33 గంటల పాటు కొనసాగిన రథోత్సవం
కదిరి , మార్చి 15 : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా అదివారం శ్రీవారి బ్రహ్మరథోత్సవం (తేరు) అ త్యంత వైభవంగా జరిగింది. తిరువీధులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. భక్తజన సందోహం తో తిరువీధులన్నీ కిక్కిరిసి పోయాయి. ఈ రథోత్సవానికి కదిరి చుట్టుపట్ల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తు లు అశేషంగా తరలి వచ్చారు. ఆదివారం ఉదయం 8.15 గంటలకు బ్రహ్మరథోత్సవం ప్రారంభమైంది. అంతకు ముందు వేద పండితులు రథారోహణం గావించారు. రథం వద్ద పుణ్యాహవాచనం, బలిహారణ, కుంభహారతి తర్వాత రథం లో స్వామివారి ఆరాధ న, అక్షతారోహణం, యూరథారణము పూజ లు చేసి, శ్రీదేవీ, భూదేవీ సమేతంగా శ్రీవారిని రథంపై కూర్చోబెట్టారు. అనంతరం శ్రీవారి రథాన్ని ఉద యం 8.15 గంటలకు ముందుకు కదిలించారు. తిరువీధు ల్లో భక్తు లు స్వామివారికి దవణం, మిరియాలు, కొబ్బ రి కాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈసంవత్సరం రథోత్సవం 4.33 గం టల్లోనే ముగిసింది. రథం ప్రారంభానికి ముందే పూజలు పూర్తి చేశారు. పూజల అనంతరం రథాన్ని ముందుకు కదిలించారు. వేలాది మంది భక్తులు మోకులను పట్టుకొని గోవింద నామస్మరణతో లాగారు. చౌక్ వద్ద రథం కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత భక్తుల గోవింద నామస్మరణ, మహా మంగళహారతి తది తర పూజలతో భక్తులు అత్యంత ఉత్సాహంగా స్వామివారి రథాన్ని ముందుకు లా గారు. వెనుక వైపున కుటాగుళ్ళ, మూర్తిపల్లి, గజ్జలరెడ్డిపల్లి తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు తెడ్లు వేయడం, మొద్దులు తొక్కడంతో వేగంగా ముందుకు కదిలింది. శివాలయం వద్ద ఉదయం 9.45 గంటలకు రథం చేరుకుంది. అక్కడ వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి పడమర రాజ గోపురం వద్ద రథంపై శ్రీవారు మరొక సారి పూజలు అందుకున్నారు. గొల్లమ్మ మటం వద్దకు సరిగ్గా మధ్యాహ్నం 11 గంటలకు రథం చేరుకుంది. అక్కడ మరో పది నిమిషాల అనతరం రథం ముందుకు కదిలింది. అక్కడ క్కడా స్వామివారి రథం కొద్దిసేపు మొరాయించినప్పటికీ ఎటువంటి ఆటంకాలు, విఘాతాలు లేకుండా 12.00 గంటలకు రథం హిందూపురం క్రాస్ చేరుకుంది. అరగంట పాటు అక్కడే రథం నిలిచిపోయింది. తిరిగి భక్తుల గోవింద నామస్మరణతో రథం ప్రారంభమైంది. యువ భక్తులు రెట్టించిన ఉత్సాహంతో రథాన్ని లాగారు. మఽధ్యాహ్నం 12.48 గంటలకు రథం యథాస్థానానికి చేరుకుంది. రథోత్సవం ముందుకు నడిపే క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారఽథి, విష్ణువర్ధన్‌రెడ్డి రథంపై ఉండి భక్తులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. కా ర్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా తదితరు లు పాల్గొన్నారు. అనంతరం రథం వెనుక మొద్దులు తొక్కిన కుటాగుళ్ళ, మూ ర్తిపల్లి, గజ్జలరెడ్డిపల్లి తదితర ప్రా ంతాలకు చెం ది న భక్తులకు మొ దటిగా శ్రీవారి ద ర్శనం కల్పించారు.
నేడు అలుకోత్సవం
శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీవారికి అలుకోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం జరిగినప్పటి నుంచి ఇంటిపట్టున ఉండకుండా, భక్తులు, భక్తులు అంటూ స్వామివారు తిరువీధుల్లో తిరుగుతున్నారని, తమను పట్టించుకోవడం లేదని శ్రీదేవీభూదేవీ అమ్మవార్లు అలకపూనుతారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి నారసింహుడు చేసే ప్రయత్నాల్లో భాగమే అలుకోత్సవం. లోకకల్యాణార్థమే తాను భక్తుల చెంతకు వెళుతున్నాని శ్రీవారు నచ్చజెప్పడంతో అమ్మవార్లు అలక మానుతారు. అమ్మవార్ల తరఫున ప్రధాన అర్చకులు, శ్రీవారి తరపున మరో అర్చకుడు సంవాదం వినిపిస్తారు. ఈ ఉత్సవానికి ఆలయ సహాయ కార్యనిర్వాహణ అధికారి ఉభయదారుడిగా వ్యవహరించడం ఆనవాయితీ. ఈ ఉత్సవం కూడా ఆ యన నివాసం వద్దే నిర్వహిస్తారు. అనంతరం అశ్వవాహనంపై తిరువీధుల్లో భక్తులకు శ్రీవారు దర్శనమిస్తారు. పక్షం రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని చాటి చెప్పేందుకే అశ్వవాహనంపై స్వామివారు దర్శనమిస్తారనేది భక్తుల నమ్మకం.