స్టేషన్‌లో లొంగిపోయేందుకు వెళ్లిన జేసీ... అంతలోనే

ABN , First Publish Date - 2020-12-28T18:17:57+05:30 IST

తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిప్రతి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి.

స్టేషన్‌లో లొంగిపోయేందుకు వెళ్లిన జేసీ... అంతలోనే

అనంతపురం: తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిప్రతి  మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో ఉన్నపళంగా  పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి బయలుదేరగా... జేసీని అనుచరులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. వారి ఒత్తిడితో జేసీ ఇంటికి చేరుకున్నారు. జేసీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తాడిపత్రి పట్టణంలోని ప్రధాన వీధుల్లో దుకాణాలను పోలీసులు మూసివేయిస్తున్నారు. 


ఇటీవల జేసీ వర్సెస్ పెద్దారెడ్డిగా తాడిపత్రిలో పరిస్థితులు నెలకొన్నాయి. జేసీ ఇంటికెళ్లిన పెద్దారెడ్డి నానా హడావుడి చేయడం.. ఈ క్రమంలో ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన అయిన విషయం విదితమే.

Updated Date - 2020-12-28T18:17:57+05:30 IST