వివాహం ఇష్టలేక యువతి బలవన్మరణం

ABN , First Publish Date - 2020-12-26T17:44:25+05:30 IST

వివాహం ఇష్టం లేకపోవడంతో ఓ యువతి ప్రాణాలు తీసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

వివాహం ఇష్టలేక యువతి బలవన్మరణం

అనంతపురం: వివాహం ఇష్టం లేకపోవడంతో ఓ యువతి ప్రాణాలు తీసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కంబదూరు మండలం కోటగుడ్డం గ్రామంలో మౌనిక అనే యువతి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మౌనిక(24)కు కుటుంబసభ్యులు వివాహం నిశ్చయించారు. అయితే వివాహం ఇష్టంలేక మౌనిక ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-12-26T17:44:25+05:30 IST