అనంతపురంలో హెడ్‌మాస్టర్ అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2020-12-11T15:17:22+05:30 IST
జిల్లాలోని గుంతకల్లు రైల్వే జంక్షన్ నాలుగవ నెంబర్ ప్లాట్ ఫామ్ సమీపంలో కోదండ రామయ్య శెట్టి అనే హెడ్ మాస్టర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు.
అనంతపురం: జిల్లాలోని గుంతకల్లు రైల్వే జంక్షన్ నాలుగవ నెంబర్ ప్లాట్ ఫామ్ సమీపంలో కోదండ రామయ్య శెట్టి అనే హెడ్ మాస్టర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. విషయం తెలిసిన రైల్వే ఎస్పీ అనిల్ బాటు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మృతుడు కోదండ రామయ్య శెట్టి విడపనకల్ మండలం అంచనహల్‌లో హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు.