గుంతకల్లు ట్రాన్స్‌కో డీఈ అవినీతి బాగోతం

ABN , First Publish Date - 2020-12-07T16:09:10+05:30 IST

గుంతకల్లు ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీర్ రవిబాబు అవినీతి బాగోతం బయటపడింది.

గుంతకల్లు ట్రాన్స్‌కో డీఈ అవినీతి బాగోతం

అనంతపురం: గుంతకల్లు ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీర్ రవిబాబు అవినీతి బాగోతం బయటపడింది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల మంజూరు కోసం రైతుల నుంచి  డీఈ రవిబాబు లక్షన్నర లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది. లైన్‌మెన్ ద్వారా డీఈ రవిబాబుకు ఇద్దరు రైతులు లక్షన్నర లంచంగా ఇచ్చుకున్నారు.  రవిబాబు అవినీతి బాగోతాన్ని  రైతులు రహస్యంగా సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో  ట్రాన్స్‌కో డీఈ రవిబాబు దృశ్యాలు వైరల్‌గా మారాయి. రైతులను వేధిస్తున్నట్లు డీఈపై కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో కొత్త ట్రాన్స్ ఫార్మర్‌కు రూ.75000వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. కొందరు దళారుల సహకారంతో  రైతుల నుంచి డీఈ రవిబాబు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డీఈ రవిబాబుపై అధికారులు చర్యలు తీసుకోవాలి రైతులు కోరుకుంటున్నారు. 

Updated Date - 2020-12-07T16:09:10+05:30 IST