ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి ఆటో డ్రైవర్ వేధింపులు

ABN , First Publish Date - 2020-10-03T17:23:47+05:30 IST

నగరంలోని నీరుగంటి వీధిలో దారుణం చోటు చేసుకుంది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి ఆటో డ్రైవర్ వేధింపులు

అనంతపురం: నగరంలోని నీరుగంటి వీధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో స్వాతి అనే యువతిని ఆటో డ్రైవర్ మునిశేషారెడ్డి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే వివాహం అనంతరం ఆటో డ్రైవర్ నిజస్వరూపం బయపడింది. వివాహం అనంతరం చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనతో పాటు మరో నలుగురు మహిళలను ఇదేవిధంగా మోసం చేశాడని బాధితురాలు వాపోయింది. ఆటో డ్రైవర్ ముని శేషారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ స్వామి  మీడియా ముందుకు వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటోంది. 

Updated Date - 2020-10-03T17:23:47+05:30 IST