ఎన్నికల విధులకు అధికారుల కేటాయింపు

ABN , First Publish Date - 2020-03-08T11:28:07+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధులకు పలువురు అధికారులను కేటాయించారు. రిటర్నింగ్‌ ఆఫీసర్లు(ఆర్వోలు), అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా

ఎన్నికల విధులకు అధికారుల కేటాయింపు

  • జడ్పీటీసీ ఎన్నికలకు ఆర్వోగా జడ్పీ సీఈఓ
  • ఐదుగురు అసిస్టెంట్‌ ఆర్వోలు
  • ఎంపీటీసీ ఎన్నికలకు ఆర్వోలుగా 63 మంది స్పెషల్‌ ఆఫీసర్లు

అనంతపురం విద్య: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధులకు పలువురు అధికారులను కేటాయించారు. రిటర్నింగ్‌ ఆఫీసర్లు(ఆర్వోలు), అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా పలువురిని నియమించారు. జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా జిల్లా పరిషత్‌ సీఈఓ శోభాస్వరూపారాణిని నియమించారు. అలాగే జిల్లావ్యాప్తంగా 5 డివిజన్లలో జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు మరో ఐదుగురిని సహాయ రిటర్నింగ్‌ ఆఫీసర్లు(ఏఆర్వోలు)గా నియమించారు. అనంతపురం డివిజన్‌కు డీఆర్‌డీఏ పీడీ, ధర్మవరం డివిజన్‌కు అగ్రికల్చర్‌ జేడీ, పెనుకొండ డివిజన్‌కు డ్వామా పీడీ, కదిరి డివిజన్‌కు ఆన్‌సెట్‌ సీఈఓ, కళ్యాణదుర్గం డివిజన్‌కు ఆత్మా పీడీని నియమించారు. అలాగే మండల కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ, పోలింగ్‌, ఇతర వ్యవహారాలకు మండలాల్లో స్పెషల్‌ ఆఫీసర్లుగా పనిచేస్తున్న అధికారులు 63 మందిని రిటర్నింగ్‌ అధికారులుగా నియమించారు. అలాగే ఆయా మండలాల్లో ఎంపీడీపీలుగా పనిచేస్తున్న వారిని సహాయ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా నియమించారు.

Updated Date - 2020-03-08T11:28:07+05:30 IST