చీప్‌ లిక్కర్‌, బీర్లే.....

ABN , First Publish Date - 2020-05-10T11:00:37+05:30 IST

: మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు సృష్టించిన కృత్రిమ కొరత కారణంగా చీప్‌ లిక్కర్‌, బీర్లతోనే మందుబాబులు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

చీప్‌ లిక్కర్‌, బీర్లే.....

  • మద్యం విక్రయాల తీరిదీ

అనంతపురం, మే 9 (ఆంధ్రజ్యోతి) : మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు సృష్టించిన కృత్రిమ కొరత కారణంగా చీప్‌ లిక్కర్‌, బీర్లతోనే మందుబాబులు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలోని అత్యధిక వైన్‌షాపుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నిషా కోసం తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని మందుబాబుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. జిల్లాలో మద్యం అమ్మకాల తీరు ఏపాటిదో దీన్నిబట్టి అర్థమవుతోంది. శనివారం నాటి అమ్మకాలు సాధారణ రోజులను గుర్తు చేశాయి. కళ్యాణదుర్గంలో మద్యం అమ్మకాలు మందకొడిగా సాగాయి. దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మద్యం కొరతను సృష్టిస్తూ అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. దీంతో చీప్‌లిక్కర్‌ కొనేందుకు మందుబాబులు దుకాణాల వైపుకు చూడకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న విమర్శలున్నాయి. గార్లదిన్నెలోని నాలుగు మద్యం దుకాణాల్లోనూ చీప్‌లిక్కర్‌, బీర్లే విక్రయించారు. నార్పల, కూడేరు, ఆత్మకూరు, శింగనమల, బుక్కరాయసముద్రంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది.


కదిరి, మడకశిరలోనూ సాధారణ రోజులను తలపించే విధంగా మద్యం దుకాణాలు నడిచాయి. ధర్మవరం, రాయదుర్గం, తాడిపత్రి తదితర ప్రాంతాల్లోనూ కావాల్సిన బ్రాండ్లు లేకపోవడంతో చీప్‌లిక్కర్‌కు బదులుగా బ్లాక్‌లో దొరికే బ్రాండ్లకే మందుబాబులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఏదేమైనప్పటికి జిల్లాలో మద్యం అమ్మకాల జోరు తగ్గిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Updated Date - 2020-05-10T11:00:37+05:30 IST