అందరి దేవుడు ఒక్కడే

ABN , First Publish Date - 2020-03-02T10:29:09+05:30 IST

మతాలు, కులాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని, అందరి దేవుడు ఒక్కడే అరటూ సత్యసాయి భక్తులు నాటిక ద్వారా ప్రదర్శించారు.

అందరి దేవుడు ఒక్కడే

పుట్టపర్తి, మార్చి 1 : మతాలు, కులాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని, అందరి దేవుడు ఒక్కడే అరటూ సత్యసాయి భక్తులు నాటిక ద్వారా ప్రదర్శించారు. పర్తి యాత్ర చేపట్టిన తెలంగాణ రాష్ట్రం అదిలాబాద్‌ సాయి భక్తులు రెండో రోజు ఆదివారం సాయికుల్వంత్‌లో సత్యసాయి ప్రేమతత్వం, ఆధ్యాత్మికతపై నాటిక ప్రదర్శించారు. సత్యసాయి ప్రేమతత్వం, బోధనల ద్వారా ప్రపంచానికే ఆధ్యాత్మిక గురువు అయ్యాడని కొనియాడారు. హిందూ, మహమ్మదీయ, క్రిస్టియన్లు సైతం సాయి దర్శనానికి వస్తున్నారని, సత్యసాయి సర్వాంతర్యామి అంటూ నాటిక ద్వారా తెలియజేశారు. భగవంతుడు, ఉపనిషత్తులు, వేదం, సత్యం వేరు వేరు కాదని, అంతా ఒక్కటేనంటూ వివరించారు. మానవత్వంలోనే మహనీయం, దైవత్వం ఇమిడిఉందని, ప్రతి మానవుని హృదయం దైవనిలయమంటూ తెలియజెప్పారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

Updated Date - 2020-03-02T10:29:09+05:30 IST