ఉపాధ్యాయ బదిలీల్లో ముగ్గురిపైనేనా చర్యలు..?

ABN , First Publish Date - 2020-12-13T06:14:54+05:30 IST

ఉపాధ్యాయ బదిలీల్లో దొడ్డదారిన దరఖాస్తు చేసుకున్న వారు భారీగా ఉన్నా, ముగ్గురిపై మాత్రం చర్యలు తీసుకుని మిగిలిన వారిపై ఉదాసీనంగా వ్యవహరించడం తగదని ఏపీటీఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు.

ఉపాధ్యాయ బదిలీల్లో ముగ్గురిపైనేనా చర్యలు..?


మిగిలిన వారిపై ఉదాసీనత ఎందుకో ? : ఏపీటీఎఫ్‌

అనంతపురం విద్య, డిసెంబరు 12: ఉపాధ్యాయ బదిలీల్లో దొడ్డదారిన దరఖాస్తు చేసుకున్న వారు భారీగా ఉన్నా, ముగ్గురిపై మాత్రం చర్యలు తీసుకుని మిగిలిన వారిపై ఉదాసీనంగా వ్యవహరించడం తగదని ఏపీటీఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు. అందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వారు శనివారం ఉపాధ్యాయభవన్‌లో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ బదిలీల్లో అక్రమంగా లబ్ధి పొందేందుకు భారీగా దరఖాస్తులు వచ్చాయన్నారు. 80 దరఖాస్తులే వచ్చాయనీ, వారిని సీనియారిటీ జాబితా నుంచి తొలగించారన్నారు. పైౖగా ముగ్గురిని సస్పెండ్‌ చేసి, ఇతరులను వదిలేయకుండా అందరిపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు, ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్‌, ఆడిట్‌ కౌన్సెలర్‌ ముత్యాలప్ప, జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌, ప్రధానకార్యదర్శి హనుమప్ప, నాయకులు శ్రీనివాసులు, నరేష్‌, తిప్పే స్వామి, రామకృష్ణ, అనంతయ్య, సాకే భాస్కర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-13T06:14:54+05:30 IST