515 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు

ABN , First Publish Date - 2020-12-30T06:18:39+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తొలి విడతలో 515 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

515 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు

కలెక్టర్‌ గంధం చంద్రుడు

అనంతపురం, డిసెంబరు29(ఆంద్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తొలి విడతలో 515 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క అక్రిడిటేషన్‌ దరఖాస్తునూ రిజెక్ట్‌ చేయలేదన్నారు. జీవో నెంబరు 142లోని నిబంధనల మేరకు అర్హులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేశామన్నారు. అర్హత ఉన్న జర్నలిస్టులకు కమిటీ అంగీకారం తెలిపిందన్నారు. ఆ మేరకు జిల్లాలో అర్హత ఉన్న 515 మంది జర్నలిస్టులకు మొదటి విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేశామన్నారు. రానివారు రాష్ట్ర సమాచార శాఖ ఆన్‌లైన్‌/వెబ్‌సైట్‌ను రీ ఓపెన్‌ చేసి, వెంటనే ప్ర భుత్వ నిబంధనల ప్రకారం సదరు డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసి, ఆ కాపీలను సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. అనంతరం అప్‌లోడ్‌ చేసిన దరఖాస్తులను పరిశీలించి, రెండో విడత సమావేశంలో అర్హత ఉన్న వారికి అక్రిడిటేషన్‌ మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ కన్వీనర్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ ఏడీ జయమ్మ, సభ్యులు డీఎంహెచ్‌ఓ కామేశ్వరరావు, కార్మికశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రఘురాములు, హౌసింగ్‌ పీడీ వెంకటేశ్వరరెడ్డి, సౌత్‌సెంట్రల్‌ రైల్వే పీఆర్‌ఓ ప్రశాంత్‌కుమార్‌, ఏపీఎ్‌సఆర్టీసీ పీఓ హరికిశోర్‌ పాల్గొన్నారు.




Updated Date - 2020-12-30T06:18:39+05:30 IST