కొరవడిన ఆదరణ.. ఏళ్లు గడుస్తున్నా..

ABN , First Publish Date - 2020-12-20T05:40:42+05:30 IST

చేతివృత్తుల వారికి యాంత్రీకరణతో అధిక ప్రయోజనాలు కల్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం అమ లు చేశారు. లక్షలాది మందికి పనిముట్లు అందజేసి ఆ వర్గాలు ఆర్థికంగా స్థిరపడేందుకు కావాల్సిన ప్రోత్సహకం అందించడంలో భాగంగానే ఈ పథకాన్ని తీసుకు వచ్చారు. ఆదరణ-1లో లబ్ధిదారులకు గత ప్రభుత్వ హయాంలోనే పనిముట్లు పంపిణీ చేశారు.

కొరవడిన ఆదరణ.. ఏళ్లు గడుస్తున్నా..

పంపిణీకి నోచుకోని ‘ఆదరణ’ పనిముట్లు

రెండేళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

రేపు క్షేత్రస్థాయిలో టీడీపీ నేతల పరిశీలన


అనంతపురం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): చేతివృత్తుల వారికి యాంత్రీకరణతో అధిక ప్రయోజనాలు కల్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం అమ లు చేశారు. లక్షలాది మందికి పనిముట్లు అందజేసి ఆ వర్గాలు ఆర్థికంగా స్థిరపడేందుకు కావాల్సిన ప్రోత్సహకం అందించడంలో భాగంగానే ఈ పథకాన్ని తీసుకు వచ్చారు. ఆదరణ-1లో లబ్ధిదారులకు గత ప్రభుత్వ హయాంలోనే పనిముట్లు పంపిణీ చేశారు. ఆద రణ-2లో పంపిణీ చేయడానికి రూ.కోట్లాది రూపాయల విలువ చేసే పనిముట్లు కొనుగోలు చేసి, లబ్ధిదారులను కూడా ఎంపిక చే శారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావటం, ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావటంతో ఆదరణ-2 పనిముట్ల పంపిణీ ఆగిపోయింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆదరణ -2 ఆగిపోయింది. వైసీపీ అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నా లబ్ధిదారులకు పనిముట్లు పంపిణీ చేయాలన్న ఆలోచన చేయలేదు.


దీంతో రూ.కోట్లాది రూపాయల విలువైన పనిముట్లన్నీ ఆయా కార్యాలయాల ఆవరణం, గోదాముల్లోనూ తుప్పుపట్టిపోతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆద రణ-2 పనిముట్లు పంపిణీ చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఈనెల 21న ఆదరణ-2 పనిముట్లను  నిల్వ ఉంచిన కార్యాలయాల ఆవరణాలు, గోదాములకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లాలోని ఆ పార్టీ అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, బీకే పార్థసారధికి సూచించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పాలనలో కొనుగోలు చేసిన ఆదరణ-2 పనిముట్లు ఏ స్థితికి చేరాయో ప్రజల కు వివరించే బాధ్యతను పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులపై పెట్టారు. లబ్ధి దారులను ఎంపిక చేసినప్పటికీ వారికి పనిముట్లు, వా హనాలు అందజేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అనంతపురం, హిందూపురం పార్లమెంటు అధ్యక్షుల నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు సోమవారం క్షేత్రస్థాయి పరిశీలనకు సమాయత్తమవుతున్నాయి.


Updated Date - 2020-12-20T05:40:42+05:30 IST