ప్రజా సమస్యలు గాలికొదిలేసిన ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-12-15T06:27:45+05:30 IST
రాష్ట్రంలో ప్రజలు చాలా సమస్యలతో సతమతమవుతుంటే జగన్ ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం, డిసెంబరు 14: రాష్ట్రంలో ప్రజలు చాలా సమస్యలతో సతమతమవుతుంటే జగన్ ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ప ట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ 2018 ఖరీ్‌ఫలో రైతులకు హక్కుగా రావాల్సిన పంటనష్టపరిహారం ఇ ప్పటిదాకా చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకా ల్లో సాయం అర్హుల్లో పదిశాతం కూడా అందడం లేదన్నారు. ప్రజా ఆర్భాటం త ప్ప జగన్ పాలనలో ప్రజలకు జరుగుతున్న మేలు శూన్యమన్నారు. కణేకల్లు, బొ మ్మనహాళ్ మండలాల్లో రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధరలతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని, తక్షణం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల ని డిమాండ్ చేశారు. 2020 ఖరీ్‌ఫలో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలన్నారు. 2019 ఖరీ్‌ఫ వాతావరణ బీమా పరిహారం జాబితాలో డీ హీరేహాళ్ మండలానికి స్థానం లేకపోవడం దురదృష్టకరమన్నారు. నిరుపేదల రేషన్‌కార్డులు తొలగిస్తుండటం అన్యాయమన్నారు. గడిచి న 20 యేళ్లలో మూడుసార్లు కూడా పంటలు పండని బీటీపీ ఆయకట్టుదారుల ను మాగాణి రైతులుగా గుర్తించి రేషన్ కార్డులు తొలగించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 198 జీవోను ఉపసంహరించుకుని పన్నులపై భారాన్ని తగ్గించాలన్నారు. రైతులకు డ్రిప్‌లు, స్ర్పింక్లర్లు, ట్రాక్టర్లతో పాటు ఆధుని క వ్యవసాయ పనిముట్లకు రాయితీ తీసివేయడం దారుణమన్నారు. యేడాదిన్న ర కాలంగా ఇసుక అక్రమ రవాణా సాగుతోందని ఆరోపించారు. ప్రజల అవసరాలకు ఇసుకను అందించకపోవడం వల్ల నిర్మాణ రంగం దెబ్బతిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించిన టిడ్కో గృహాలను పూర్తి చేసి పట్టణ ప్రజల కు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరై ని ర్మాణంలో వున్న పక్కా గృహాల బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరా రు. జడ్పీ మాజీ చైర్మన్ పూల నాగరాజు మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో పేదల రే షన్‌కార్డులను అన్యాయంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. దీంతో బీటీపీ ఆయకట్టు రైతు కుటుంబాలు అన్యాయానికి గురవుతున్నారన్నారు. సమావేశంలో టీ డీపీ నాయకులు బండి క్రిష్ణమూర్తి, ముదిగల్లు జ్యోతి, నల్లపూల వెంకటేశులు, ప సుపులేటి నాగరాజు, కురుబ హనుమంతు, గిరిమల్లప్ప, లాలెప్ప, రాఘవరెడ్డి, మోహన్‌రెడ్డి, ఫకృద్దీన్, కాటా హనుమంతరాయుడు, సంపత్ కుమారి తదితరులు పాల్గొన్నారు.
గోరుముద్ద పేరుతో విద్యార్థులకు విషపు ముద్దలా?
బొమ్మనహాళ్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకం పేరుతో విషపు ముద్దలు పెట్టడం ఏంటని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు పురుగులు పట్టిన చిక్కీలు సరఫరా కావడంతో ఆయన స్పందిం చి సోమవారం స్థానిక విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలకు పురుగులు పట్టిన చిక్కీలు సరఫరా చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. మండలంలోని చంద్రగిరి ప్రభుత్వ హైస్కూలులో విద్యార్థులకు పంపిణీ చేసిన చిక్కీలలో పురుగులు వుండటం వల్ల పిల్లలు వాటిని తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. జగనన్న గోరుముద్దల పేరుతో విద్యార్థులకు విషపు ముద్దలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై వుందన్నారు. జగనన్న గోరుముద్ద అనే పథకం పెట్టి చేతులు దులుపు కోవడం ప్రజాప్రతినిధుల బాధ్యత కాదని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందా లేదా వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది గుర్తించాలన్నారు.