16 నుంచి నాలుగో విడత రేషన్‌ పంపిణీ

ABN , First Publish Date - 2020-05-09T09:47:11+05:30 IST

కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల్లో ఈనెల 16 నుంచి 27వ తేదీ వరకు నాలుగో విడత ఉచిత

16 నుంచి నాలుగో విడత రేషన్‌ పంపిణీ

అనంతపురం వ్యవసాయం, మే 8:  కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల్లో ఈనెల 16 నుంచి 27వ తేదీ వరకు నాలుగో విడత ఉచిత సరుకుల(రేషన్‌) పంపిణీ ఉంటుందని డీఎస్‌ఓ శివశంకర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. నాలుగో విడతలో బియ్యం, పప్పుశనగలు ఉచితంగా ఇస్తామన్నారు. చక్కెర, గోధుమ పిండికి డబ్బు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈనెల 10వ తేదీ వరకు మూడో విడతలో బియ్యం, కంది బేడలు ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఇంకా తీసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2020-05-09T09:47:11+05:30 IST