104 మొబైల్ క్లినిక్ డాక్టర్ల నియామకానికి దరఖాస్తులు
ABN , First Publish Date - 2020-08-22T09:53:34+05:30 IST
ఆరోగ్యశ్రీ ట్రస్టు సహకారంతో నడుస్తున్న 104 మొబైల్ మెడికల్ క్లినిక్‌లలో డాక్టర్ల నియామకం చేపడుతున్నట్లు డీఎంహెచ్‌ఓ కామేశ్వరప్రసాద్, జిల్లా మేనేజర్ వరప్రసా
అనంతపురం వైద్యం, ఆగస్టు 21: ఆరోగ్యశ్రీ ట్రస్టు సహకారంతో నడుస్తున్న 104 మొబైల్ మెడికల్ క్లినిక్‌లలో డాక్టర్ల నియామకం చేపడుతున్నట్లు డీఎంహెచ్‌ఓ కామేశ్వరప్రసాద్, జిల్లా మేనేజర్ వరప్రసాద్ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 63 మండలాల్లో 104 వాహనాలు నడుస్తున్నాయన్నారు. ప్రతి మండల మెడికల్ క్లినిక్‌కు ఎంబీబీఎస్ అర్హత కలిగిన డాక్టర్‌ను నియమిస్తున్నామన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వైద్యులు మూడు రోజుల్లోపు జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. వివరాలకు సెల్‌నెంబర్ 9177002479లో సంప్రదించాలన్నారు.