ఫూల్‌ మఖానా పాయసం

ABN , First Publish Date - 2017-08-12T21:54:59+05:30 IST

ఫూల్‌ మఖానా - రెండు కప్పులు, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, పాలు - అర లీటర్‌, పంచదార - రుచికి తగినంత, యాలకుల పొడి

ఫూల్‌ మఖానా పాయసం

కావలసిన పదార్థాలు
 
ఫూల్‌ మఖానా - రెండు కప్పులు, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, పాలు - అర లీటర్‌, పంచదార - రుచికి తగినంత, యాలకుల పొడి - అర టీ స్పూను, కుంకుమపువ్వు - చిటికెడు, జీడిపప్పు, బాదం, కిస్మిస్‌, పిస్తా - పావు కప్పు.
 
తయారుచేసే విధానం
 
నెయ్యిలో ఫూల్‌ మఖానా దోరగా వేగించాలి. దళసరి అడుగున్న పాన్‌లో పాలు పోసి సగమయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు ఫూల్‌ మఖానా, డ్రైఫ్రూట్స్‌ వేయాలి. అవి మెత్తబడ్డాక పంచదార, యాలకుల పొడి, పాలలో కరిగించిన కుంకుమపువ్వు కలిపి ఐదు నిమిషాల తర్వాత దించేసి పిస్తాతో అలంకరించాలి. పాయసాన్ని వేడిగా లేదా చల్లగా తాగొచ్చు.

Updated Date - 2017-08-12T21:54:59+05:30 IST